
'ఢీ' మంచు విష్ణు మరియు శ్రీనువైట్ల కెరియర్ లో ఒక మైలురాయిగా, అతిపెద్ద మలుపుగా మిగిలిపోయింది. ఈ చిత్రం నుండి పంచ్లైన్లు మన రొటీన్ లైఫ్ లో ఎలా వాడతామో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కొంతకాలం నుండి, శ్రీను వైట్ల ఢీ సీక్వెల్ కోసం మళ్ళీ మంచు విష్ణుతో కలిసి రావాలని ఆలోచిస్తున్నట్లు పుకార్లు వస్తున్నాయి. తాజాగా, మంచు విష్ణు ఈ విషయంలో ట్వీటర్ లో కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలను రాశాడు. ఢీ 2 ను ప్రారంభించినందుకు కంగ్రాట్స్ అంటూ కాల్స్ వస్తున్నాయని...వాటిని ఉద్దేశించి, విష్ణు తన సోదరుడిలాంటి శ్రీను వైట్లాను బాగా అడగాలని మరియు ప్రాజెక్ట్ వివరాలలో తనని ఇన్వాల్వ్ చేయొద్దని ఢీ స్టైల్ లో చెప్పాడు. ఇదంతా చూస్తుంటే ఢీ 2 త్వరలోనే మన ముందుకు వచ్చేట్టు ఉంది. ఏదేమైనా అధికారిక ప్రకటన వచ్చే వరకు ఏమి చెప్పలేని పరిస్థితి. ఢీ 2 అంటే మాత్రం, అంచనాలు భారీగానే ఉంటాయి. మరి శ్రీను వైట్ల ఎం చేస్తారో వేచి చూద్దాం.