
రక్షా బంధన్ 2020 సందర్భంగా, 'మోసగాల్లు' మేకర్స్ రాబోయే ఇండియన్-హాలీవుడ్ ప్రాజెక్ట్ గురించి కొత్త ప్రకటన విడుదల చేసారు. ఈ ప్రాజెక్ట్ లో, మంచు విష్ణు మరియు కాజల్ అగర్వాల్ అన్నాచెల్లెలుగా స్క్రీన్ స్పెస్ ను పంచుకోనున్నారు. తాను పనిచేసే సినిమాల్లో తన పాత్రల పట్ల నిబద్ధతకు పేరుగాంచిన నటి కాజల్ అగర్వాల్ ఈ చిత్రానికి ప్రత్యేక శిక్షణ పొందింది. ఈ చిత్రం చరిత్రలో జరిగిన అతిపెద్ద I.T స్క్యామ్ పై తీయబడింది. ప్రస్తుతం, ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి, రుహి సింగ్, నవీన్ చంద్ర, నవదీప్ ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. లాస్ ఏంజిల్స్‌కు చెందిన దర్శకుడు జెఫ్రీ గీ చిన్ ఈ ప్రాజెక్టుకు దర్శకత్వం వహిస్తున్నారు.