
మెగా కాంపౌండ్ నుంచి వచ్చే హీరోలకు ఒక సెంటిమెంట్ ఉంది. అదేంటంటే....వారి మొదటి సినిమా వేరే బ్యానర్ లో తీసీ, రెండో సినిమా మాత్రం గీత ఆర్ట్స్ బ్యానర్ లో తీస్తారు. అల...అయితే హిట్ గ్యారెంటీ అని నమ్ముతారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ 'చిరుత' సినిమా వైజేయంతి మూవీస్ బ్యానర్ లో రాగా రెండో చిత్రం 'మగధీర' గీత ఆర్ట్స్ బ్యానర్ లో వచ్చింది. సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ సినిమా 'రేయ్' యువీస్ చౌదరి ప్రొడ్యూస్ చేయగా రెండో సినిమా 'పిల్ల నువ్వులేని జీవితం' గీత ఆర్ట్స్ బ్యానర్ లో వచ్చింది. ఇప్పుడు ఇదే సెంటిమెంట్ ను సాయి ధరమ్ తేజ్ తమ్ముడు విష్ణు తేజ్ ఫాలో కానున్నాడు. ఇప్పటికే 'ఉప్పెన' సినిమా థియేటర్లు ఎప్పుడు తెరిస్తే అప్పుడు రిలీజ్ అయ్యేందుకు సిద్ధంగా ఉండగా రెండో సినిమా గీత ఆర్ట్స్ బ్యానర్ లో లాక్ అయినట్లు తెలుస్తోంది. కథ కూడా ఫైనల్ చేసారని త్వరలోనే అధికారిక ప్రకటన రానున్నట్లు సమాచారం.