
మహేష్ బాబు, రష్మీక జంటగా నటించిన "సరిలేరు నీకెవ్వరు" సంక్రాంతి కానుకగా జనవరి 11న రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో నిన్న హైదరాబాద్ ఎల్ బి స్టేడియంలో ప్రి రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహించారు. ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి వచ్చిన సంగతి తెలిసిందే. చిరు ఆహ్వానంతో ఈవెంట్ మెగా సూపర్ సక్సెస్ అయింది. అయితే ఈవెంట్ లో మెగాస్టార్ మాట్లాడుతూ...."సినిమా అతి తక్కువ రోజుల్లో పూర్తి చేసినందుకు దర్శకుడు అనిల్ రావిపూడిని మెచ్చుకోవాల్సిందే. మహేష్ తో 80-90 రోజుల్లో సినిమా తీసి కొత్త రికార్డ్ క్రియేట్ చేశావు. తక్కువ రోజుల్లో షూటింగ్ పూర్తి చేయటం వల్ల నిర్మాతకు ఎంతో మేలు జరుగుతుంది. అందరూ తక్కువ రోజుల్లో మంచి ఔట్ ఫుట్ తో సినిమా తీయాలి. నా 152వ చిత్ర దర్శకుడు కొరటాల శివ ఇక్కడే ఉన్నారు. నువ్వు కూడా వంద రోజుల లోపే సినిమా పూర్తి చేయాలి. 99వ రోజు వరకు కూడా వెళ్ళకూడదు ‘ అని స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. దానిని కొరటాల శివ నవ్వుతూ అంగీకరించారు.