
కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రస్ అయిన రామ్ గోపాల్ వర్మ నైనా గంగూలీతో డాన్స్ చేస్తూ దొరికిపోయాడు. దానికి సంబంధించిన వీడియో క్లిప్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ వీడియోలో నైనా గంగూలీతో కాళ్లు కదుపుతూ స్టెప్పులేసాడు అర్జీవి. "బ్యూటీఫుల్" అనే చిత్ర ప్రి రిలీజ్ ఈవెంట్ కు వెళ్లిన వర్మ...ఆ చిత్ర హీరోయిన్ తో చిందులేయటం ఇప్పుడు హాట్ టాపిక్ గా నడుస్తుంది. ఎప్పుడు మాటలతో కాంట్రావెర్సిలతో మాత్రమే సమయం గడిపే అర్జీవిలో ఈ టాలెంట్ కూడా ఉందా అని నెటిజన్లు షాక్ అవుతున్నారు. రొమాంటిక్ కామెడీ చిత్రంగా తెరకెక్కిన బ్యూటీఫుల్ ఇటీవలే సెన్సార్ పూర్తి చేసుకొని "A" సర్టిఫికెట్ తెచ్చుకుని జనవరి 1న రిలీజ్ అయ్యేందుకు సిద్ధంగా ఉంది. బోల్డ్ కంటెంట్ తో వస్తున్న ఈ చిత్రంను ప్రమోట్ చేసేందుకు వచ్చిన అర్జీవి స్టెప్పులు వేయటం చూసిన ప్రతి ఒక్కరు ఆయనలో ఈ యాంగిల్ కూడా ఉందా అని ఆశ్చర్యపోతున్నారు.