
నేడు మిల్కి బ్యూటీ తమన్నా పుట్టినరోజు సందర్భంగా "సరిలేరు నీకెవ్వరు" లో తమన్నా లుక్ ను బర్త్ విషెస్ చెప్తూ రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. మహేష్ హీరోగా, రష్మీక మందన్న హీరోయిన్ గా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న "సరిలేరు నీకెవ్వరు" చిత్రంలో తమన్నా స్పెషల్ సాంగ్ లో కనిపించనుంది. తమన్నా ఐటెం సాంగ్ లో చేస్తుందనే వార్త ముందే బయటకు వచ్చింది. తాజాగా ఆమె పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ లో తమన్నా మిలటరీ ప్యాంట్, రెడ్ టాప్ లో కవ్వించే లుక్స్ తో హాట్ గా కనిపిస్తుంది. ఇక 'ఆజ్ మేరా ఘర్ మే పార్టీ హై తు ఆజా మేరే రాజా' అనే ఈ పాట మాస్ ప్రేక్షకులను ఆకట్టుకోవడం ఖాయమంటున్నారు. ఈ పాట చిత్రీకరణ హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోస్ లో శేఖర్ మాస్టర్ కొరియోగ్రాఫీలో జరిగింది. మాస్ స్టెప్పులతో తమన్నా మెప్పిస్తుందని అంటున్నారు.