
కిషోర్ రెడ్డి దర్శకత్వంలో చురుకైన వేగంతో షూటింగ్ జరుపుకుంటున్న చిత్రం "శ్రీకారం". ఈ చిత్రంలో శర్వానంద్ హీరోగా, నాని గ్యాంగ్ లీడర్ ఫెమ్ ప్రియాంక హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని రామ్ ఆచంట మరియు గోపి ఆచంట 14 రిల్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఈరోజు ఉదయం 'శ్రీకారం' నుండి మేకర్స్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. శ్రీకారం ఫస్ట్ లుక్ పోస్టర్ చూస్తుంటే, శర్వానంద్ లుంగీ కట్టుకోని భుజం మీద కండువాతో పొలంలో నడుస్తున్నట్లు కనిపిస్తున్నాడు. మిక్కీ జె మేయర్ మ్యూజిక్ అందిస్తుండగా మార్తాండ సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ప్రసిద్ధ రచయిత సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ అందిస్తున్నారు. 2019 జూన్ లో పూజ కార్యక్రమంతో మొదలైన చిత్రంను 2020 వేసవిలో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇకపోతే శర్వానంద్ తమిళ 96 రీమేక్ 'జాను' లో సమంతతో నటిస్తున్న విషయం తెలిసిందే.