
ఇటీవల ఒక ఆడియో ఫంక్షన్లో మెగాస్టార్ చిరంజీవి మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ కోసం మాటల మాంత్రికుడి త్రివిక్రమ్ శ్రీనివాస్ తో కలిసి పని చేయబోతున్నట్లు ధృవీకరించారు. ఇంతకుముందు వారిద్దరి కాంబోలో జై చిరంజీవా వచ్చింది. కాని ఆ సినిమాకు త్రివిక్రమ్ కేవలం రచయిత. అయితే మెగాస్టార్- త్రివిక్రమ్ కాంబోలో సినిమా అనగానే మెగా అభిమానులు మరియు త్రివిక్రమ్ అభిమానులు కూడా ఎప్పుడెప్పుడా అప్డేట్ వస్తుందా అని ఎదురుచూస్తున్నారు. మెగాస్టార్ కామెడీ టైమింగ్, త్రివిక్రమ్ యొక్క మార్క్ డైలాగ్స్ ఈ ప్రాజెక్ట్ బాక్సాఫీస్ ను షేక్ చేయటం ఖాయం. అయితే ప్రకటన నుండి ఈ ప్రాజెక్ట్ గురించి ఎటువంటి అప్డేట్ లేదు. ప్రస్తుతం చిరు కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. వయసు దృశ్య తొందరపడకుండా సినిమాలు చేస్తున్నారు చిరు. మరోపక్క త్రివిక్రమ్ నెక్స్ట్ ఎన్టీఆర్ తో చేయనున్నారు. మరి ఎన్టీఆర్ తో సినిమా పూర్తి చేశాక చిరుతో డైరెక్ట్ చేస్తారా? లేదా మరింత సమయం పడుతుందా ? అనేది తెలియాల్సి ఉంది.