
సమంత నాగచైతన్యను పెళ్లాడిన తర్వాత అక్కినేని వారి కోడలిగా ఒక మెట్టు ఎదిగింది. మంచి భార్యగా, కోడలిగా తన బాధ్యతలను నిర్వహిస్తూనే నటిగా రోజు రోజుకు అంచెలంచెలుగా ఎదుగుతుంది. పెళ్లి తన కెరియర్ కు అడ్డంగా నిలబడుతుందే తప్పు అడ్డుగా కాదని నిరూపిస్తూ వస్తుంది. అయితే అక్కినేని జంట సమంత, నాగచైతన్యలలో సమంత సోషల్ మీడియాలో ఎక్కువ యాక్టివ్ గా ఉంటుంది. కెరియర్, కుటుంబం, ప్రత్యేక సందర్భాలకు సంబంధించిన పోస్ట్లు పెట్టి ఫ్యాన్స్ తో నిత్యం టచ్ లో ఉంటుంది. ఇక ఈ జంట విదేశాళ్లకు వెళ్తే అంతే సంగతులు. కానీ ఈసారి మాత్రం అలా జరగలేదు. నూతన సంవత్సర వేడుకలు జరుపుకునేందుకు గోవా వెళ్లారు ఈ జంట. కానీ ఎప్పటిలా సమంత మాత్రం ఒక్క ఫోటో కూడా పోస్ట్ చేయలేదు. సెలెబ్రిటీలు అందరూ నూతన సంవత్సర విషెస్ తెలియజేస్తే సమంత అది కూడా చేయ్యకపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అయితే కొందరు మాత్రం సోషల్ మీడియాలో పోస్ట్లు చేసి చేసి సమంత అలిసిపోయి బ్రేక్ తీసుకోని ఉంటుందని అంటున్నారు. మరి సమంత సోషల్ మీడియా నిశ్శబ్దం వెనుక అసలు కారణం ఏమిటో!