
మహేష్ బాబు, రష్మీక జంటగా నటించిన 'సరిలేరు నీకెవ్వరు' చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 11న రిలీజ్ కాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన ప్రి రిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి వచ్చిన సంగతి తెలిసిందే. మెగా సూపర్ ఈవెంట్ సూపర్ సక్సెస్ అయింది. మెగాస్టార్, సూపర్ స్టార్ ఒకరిని ఒకరు గౌరవించుకుంటూ సాగిన సంభాషణ ఫ్యాన్స్ లో ఉత్సాహాన్ని నింపాయి. అయితే ఇదే విషయంపై మెగా ఓవర్ స్టార్ రామ్ చరణ్ తన అభిప్రాయాన్ని తెలియజేశాడు. "సరిలేరు నీకెవ్వరు ఈవెంట్ కు నాన్న వెళ్లడమే కాకుండ అక్కడ నాన్న నడుచుకున్న విధానం ఇప్పుడు టాలీవుడ్ లో ఎంతో అవసరమని" రామ్ చరణ్ అన్నారు. చెర్రీ మాటలు ముమ్మాటికీ నిజమే...ఈవెంట్ లో మెగాస్టార్ తీరుకు అభిమానులు ఫిదా అవుతున్నారు. అంతేకాదు ఇండస్ట్రీలో స్నేహాభిమానాల్ని పెంచుతుంది. ఇకపోతే రామ్ చరణ్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్ లో అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నాడు.