
కోలీవుడ్లో లేడీ సూపర్ స్టార్ గా అగ్ర స్థానంలో కొనసాగుతుంది నయనతార. వయసు పెరుగుతున్నా కూడా తనకు అవకాశాలు మాత్రం తగ్గట్లేదు. అగ్ర నటులైన రజనీకాంత్, అజిత్ లాంటి హీరోలతో నటిస్తూ బిజీగా గడుపుతుంది. ప్రస్తుతం ఏఆర్ మురగదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న "దర్బార్" లో నటిస్తుంది. ఇకపోతే ప్రొఫెషనల్ లైఫ్ గురించి కంటే పర్సనల్ లైఫ్ గురించే నయన్ ఎక్కువగా వార్తల్లో నిలుస్తుంటుంది. ఇప్పుడు మరోసారి తన ప్రియుడితో బ్రేకప్ చేసుకోనుందని వార్తల్లో నిలిచింది. అయితే, సినీ కెరియర్ ప్రారంభించాక నయనతార నటుడు శింబుతో ప్రేమలో పడింది ఆతర్వాత మనస్పర్థలు రావటంతో విడిపోయారు. దాని నుండి బయటకు రావడానికి ఆమెకు చాలా సమయమే పట్టింది. ఆతరువాత ప్రభుదేవాతో పెళ్లి వరకు వెళ్లి క్యాన్సల్ అయ్యింది. ఇక నటనపై పూర్తిగా ఫోకస్ పెట్టిన సమయంలో దర్శకుడు విగ్నేష్ తో ప్రేమలో పడింది. చాలా రోజులుగా అతడితో సహజీవనం చేస్తుంది. తాజాగా ఈ జంట మధ్య మనస్పర్ధలు వచ్చినట్లు సమాచారం. అగ్ర స్థానంలో కొనసాగుతున్న నయన్ పై అప్పుడే పెళ్లి చేసుకోవాలని లేకపోవడంతో వ్యతిరేకించిందట. దీంతో కోపంతో విగ్నేష్ ఉన్నఫలంగా వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. మరి ఇది ఎక్కడికి దారి తీస్తుందో చూడాలి.