
అక్కినేని నాగార్జున హోస్ట్ గా బాధ్యతలు వ్యవహరిస్తున్న బిగ్ బాస్ సీజన్ 4 లో ఎన్నో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. నాగార్జున హోస్ట్ గా ఉన్నారు కాబట్టే కొంతమంది చూస్తున్నారంటే అతిశయోక్తి కాదు. ఇంటి సభ్యులను ఎప్పుడు నవ్వించాలో, ఎప్పుడు మందలించాలో నాగ్ కు బాగా తెలుసు. అయితే చూస్తున్న ప్రేక్షకులకు ఒక ప్రశ్న తలెత్తింది...నాగార్జున ఇంటి సభ్యులలో ఎవరు ఇష్టమని...దానికి ఎవరి దగ్గర కచ్చితమైన సమాధానం లేకపోయినప్పటికి...తన భార్య అమలతో కలిసి లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ లో నటించిన అభిజీత్ అంటే ఇష్టమని నాగ్ మాటల ద్వారా పరోక్షంగా తెలుస్తుంది. అందుకే నాగార్జున అభిజీత్ ను మందలించి ఇంకా బాగా ఆడేలా చేస్తున్నారని కావాలని ప్రతి వారం డ్యాన్స్ చేయిస్తున్నారని అంటున్నారు. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందొ తెలియదు కానీ అభిజీత్ కు మాత్రం బయట విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.