
టాలీవుడ్ లో ప్రస్తుతం టాప్ ప్లేస్ లో ఉంది హీరోయిన్ పూజ హెగ్డే. వరుస విజయాలతో ఏమా స్పీడ్ తో దూసుకుపోతుంది. స్టార్ హీరోల పక్కన రొమాన్స్ చేస్తూ ఉన్న క్రేజ్ పెరుగుతుంది. అరవింద సమేత, మహర్షి, అల..వైకుంఠపురములో ఇలా వరుసగా బ్లాక్ బస్టర్స్ తో అగ్ర స్థానంలో కొనసాగుతుంది. అయితే దర్శకుడు క్రిష్ పవన్ కోసం ఇండిపెండెన్స్ కు ముందు సన్నివేశాల ఆధారంగా కథను సిద్ధం చేశాడని తెలుస్తోంది. అందులో పవర్ స్టార్ రాబిన్ హుడ్ తరహా పాత్రలో కనిపించనున్నాడట. క్రిష్ పవన్ కు కధ చెప్పడం...అది నచ్చడంతో పవన్ ఓకే చేయటం జరిగిందని ఇన్సైడ్ టాక్. ఈ సినిమాలో హీరోయిన్ కోసం పూజ హెగ్డేను తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నాడట క్రిష్. ఈ మేరకు పూజకు కధ కూడా చెప్పాడట. పూజ కధ నచ్చడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని సమాచారం. మరి ఇందులో ఎంతమాత్రం నిజం ఉందో తెలియాలంటే కొంత సమయం వేచి చూడాల్సిందే.