
నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ సీజన్ 4 సక్సెసఫుల్ గా సాగుతుంది. అయితే వైల్డ్ డాగ్ షూటింగ్ నిమిత్తం 21 రోజుల షెడ్యూల్ కోసం నాగార్జున మనాలీ వెళ్లినట్లుగా అందుకే బిగ్ బాస్ స్టేజ్ ను మరియు ఇంటి సభ్యులను కోడలు పిల్ల సమంత అక్కినేనికి అప్పగించానని వీడియో ద్వారా నాగ్ చెప్పిన విషయం తెల్సిందే. ఈమేరకు దసరా స్పెషల్ గా స్టేజ్ ఎక్కిన సమంత దుమ్మురేపింది. అయితే నాగ్ 21 రోజుల పాటు ఉండరు అంటే మరో రెండు వారాలు మరి ఈ వీకెండ్ హోస్ట్ గా ఎవరొస్తారనేది చర్చనీయాంశంగా మారింది. కానీ విశ్వసనీయవర్గాల సమాచారం ప్రకారం నాగార్జుననే వీకెండ్ హోస్ట్ చేయబోతున్నారట. మనాలి ఇక్కడకు పెద్ద దూరం కాకపోవడంతో శుక్రవారం వచ్చి శని,ఆదివారాల ఎపిసోడ్లు షూట్ చేసి తిరిగి మనాలి వెళ్తారట. గత వారం కూడా అలానే ప్లాన్ చేసుకున్నప్పటికీ వాతావరణం సహకరించకపోవటంతో ప్రయాణం కాన్సెల్ అయ్యిందట. దింతో ఈసారి నాగార్జునానేనని అర్ధం అయిపోయింది.