
యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ మరియు దర్శకుడు నాగ్ అశ్విన్ కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. బాహుబలి లాంటి గొప్ప సినిమా తరువాత, ప్రభాస్ ఇంటర్నేషనల్ స్టార్ అయిన విషయం అందరికి తెలిసిందే. అందుకే ఆ సినిమా తర్వాత ప్రభాస్ కేవలం పాన్ ఇండియా సినిమాలనే చేస్తున్నాడు. అలానే అతను హీరోగా తెరకెక్కే సినిమాలకు కోట్లు పెట్టడానికి సిద్ధమవుతున్నారు నిర్మాతలు. వైజయంతి మూవీస్ పతాకంపై అశ్వని దత్ నిర్మిస్తున్న ఈ చిత్రం త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది. అయితే ప్రభాస్ చిత్రం అనగానే కచ్చితంగా అది భారీగా ఉంటుందని ఫ్యాన్స్ భావిస్తారు. దీంతో ఆ అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా అశ్వని దత్ ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా బడ్జెట్ సుమారు రూ.400 కోట్లని సమాచారం. మరి బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, టాప్ హీరోయిన్ దీపికా పదుకునే లాంటి స్టార్స్ ను పెట్టినప్పుట్టు ఆ మాత్రం అవ్వడంలో తప్పు లేదుగా.