
కాంట్రవర్షియల్ డైరెక్టర్ ఆర్జీవీ ఇప్పుడు ఎలా తయారయ్యారంటే రెండు రోజుల్లో ఏదొక కాంట్రవర్సీ తీసుకొని కధ రాసేయాలి దాన్ని ఐదు రోజుల్లో షూట్ చేసి రిలీజ్ చేసేయాలి. ఆర్జీవీకి పిచ్చి, పైత్యం అన్నా కూడా పట్టించుకోడు తన ధోరణి తనదే. అయితే ఇతనికి మెగా ఫ్యామిలీకి ఎక్కువ ఎక్కువ పడనట్లు తెలుస్తుంది. ఎన్నోసార్లు ఆర్జీవీ పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తూ మాట్లాడిన సందర్భాలు చూసాము. అంతే కాదు మొన్న ఏకంగా పవర్ స్టార్ అనే టైటిల్ తో సినిమా కూడా తీసాడు. అయితే ఆర్జీవీ ఇప్పటి వరకు నాగార్జున, వెంకటేష్ లాంటి హీరోలతో సినిమాలు తీసాడు కానీ మెగా ఫ్యామిలీలో ఒక్కరితో కూడా తీయలేదు. దానికి, 'కధలు నచ్చకపోవటమో, డేట్స్ కుదరకపోవటమో జరిగాయి. కానీ నేను పవన్ కు మెగాస్టార్ కు కధలు చెప్పడం జరిగింది. కానీ అవి ముందుకెళ్ళలేదు నా కారణంగా' అని సమాధానం ఇచ్చాడు. ఏదేమైనా ఆర్జీవీని, అతని మాటలను నమ్మలేము.