
రెండేళ్ల క్రితం విడుదలైన 'ఛలో' తో నటుడు నాగశౌర్య సూపర్ సక్సెస్ అందుకున్నాడు. కానీ అదే సక్సెస్ ను మెయింటైన్ చేయడంలో శౌర్య విఫలమయ్యాడు. కణం, అమ్మమ్మ గారిల్లు, నర్తనషాలాతో వరుస అపజయాలను ఎదురుకున్నాడు. ఈ ఫలితాలతో నిరాశ పడ్డ శౌర్య, కొంత గ్యాప్ తీసుకోని, 'అశ్వద్దామ' స్క్రిప్ట్‌ను సిద్ధం చేసాడు. దర్శకుడు రమణ తేజ ఈ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవుతున్నారు. ఈ చిత్రం షూటింగ్ వేగవంతంగా పూర్తి చేసుకుంది. శౌర్య అశ్వద్ధామ జనవరి 31న రిలీజ్ కానుంది. అయితే అదే రోజున అనుష్క నటించిన నిశ్శబ్దం రిలీజ్ అవ్వాల్సింది. కానీ కొన్ని కారణాల వల్ల నిశ్శబ్దం పోస్ట్ పోన్ అయింది. దీంతో నాగశౌర్య సినిమాకు పోటీగా ఉన్న నిశ్శబ్దం పోస్ట్ పోన్ అవ్వటంతో గోల్డెన్ అపర్చునిటీ వచ్చినట్లు అయింది. మరి బాక్స్ ఆఫీసు వద్ద ఎంతమాత్రం ప్రతాపం చూపిస్తుందో చూడాలి.