
పవన్ కళ్యాణ్ తనకు 'గబ్బర్ సింగ్' లాంటి ఎవర్ గ్రీన్ హిట్ ఇచ్చిన దర్శకుడు హరీష్ శంకర్ తో రెండోసారి చేతులు కల్పిన విషయం తెలిసిందే. ప్రస్తుతం, పవన్ పింక్ యొక్క తెలుగు రీమేక్, క్రిష్ పిర్యాడిక్ డ్రామాను పూర్తి చేసిన తరువాత హరీష్ శంకర్ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లనుంది. ఇదిలావుండగా, పవన్ 28 వ చిత్రంలో పవన్ సరసన నటించబోయే హీరోయిన్ పై అందరి దృష్టి ఉంది. అయితే, హరీష్ దర్శకత్వంలో వచ్చిన 'డీజే' మరియు 'గద్దలకొండ గణేష్' చిత్రాల్లో హీరోయిన్ గా మెప్పించిన పూజ హెగ్డేను పి.ఎస్.పికె 28 లో మహిళా ప్రధాన పాత్ర కోసం మళ్ళీ ఎంపిక చేసుకోవాలని భావిస్తున్నాడు హరీష్ శంకర్. టాలీవుడ్ లో ప్రస్తుతం టాప్ హీరోయిన్ జాబితాలో కొనసాగుతూ వరుసగా సినిమాలు చేస్తున్న పూజ, పవన్ సరసన నటిస్తుందా లేదా అనేది తెలియాల్సి ఉంది. సినిమాపై మరిన్ని వివరాల కోసం వేచి చూడాలి. ఇకపోతే పవన్ పింక్ యొక్క తెలుగు రీమేక్ తన భాగం షూటింగ్ ను పూర్తి చేసి, క్రిష్ సినిమా కోసం సిద్ధం అవుతున్నాడు.