
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్ ను, ఇమేజ్ ను మెగా హీరోలు తమ సినిమాల్లో వాడుకుంటూ ఉంటారు. ఒక పాటను కానీ, సిన్ ను కానీ ఇమిటేట్ చేస్తుంటారు. అలా వరుణ్ తేజ్ తన సినిమాకు ఓవన్ కళ్యాణ్ హిట్ సినిమా అయిన "తొలిప్రేమ" టైటిల్ ను పెట్టుకొని మంచి హిట్ కొట్టాడు. ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ...పవన్ కెరియర్లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ అయిన 'జానీ' సినిమాను వరుణ్ రీమేక్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అల్లు అరవింద్ సమర్పణలో అల్లు బాబీ నిర్మిస్తున్న సినిమాలో వరుణ్ తేజ్ నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇది బాక్సింగ్ నేపధ్యంలో సాగే సినిమా. తెలుగులో బాక్సింగ్ నేపద్యంలో వచ్చిన జానీ సినిమాకు కొన్ని మార్పులు, చేర్పులు చేసి సినిమా తీస్తే కచ్చితంగా హిట్ అవుతుందని భావిస్తున్నారట. అప్పుడు కధ బాగున్నప్పటికి దర్శకత్వం లోపం వల్ల ప్లాప్ అయింది. దీంతో ఈసారి వరుణ్ ఇమేజ్ కు తగ్గట్టుగా కథను కాస్త మార్చి అప్పుడు చేసిన తప్పులను చేయకుండా చూసుకుంటే మంచి విజయం సాధిస్తుందని నమ్మి సినిమా తెరకెక్కిస్తున్నారట.