
రష్మిక మందన్న, ఇప్పుడు టాలీవుడ్ లో అత్యంత బిజీ మరియు క్రేజ్ ఉన్న హీరోయిన్లలో ఒకరు. ఈ ముద్దుగుమ్మ ఇటీవలే సూపర్ స్టార్ మహేష్ బాబుతో 'సరీలేరు నీకెవ్వరు'లో నటించింది. ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని రుచి చూసింది. ఈ సినిమా మహేష్ బాబు కెరీర్లో అత్యధిక వసూళ్లు సాధించింది. ప్రస్తుతం, నితిన్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం 'భీష్మ' తో మరో 10 రోజుల్లో ప్రేక్షకులను పలకరించనుంది. భీష్మ చిత్రంలో రష్మికకు మంచి, సుదీర్ఘమైన పాత్ర లభించినట్లు కనిపిస్తుంది. రష్మికాను టాలీవుడ్‌కు పరిచయం చేసిన వెంకి కుడుముల ఈ సినిమాకు దర్శకత్వం వహించడం విశేషం. ప్రస్తుతం రష్మీక ఖాతాలో సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కనున్న అల్లు అర్జున్ చిత్రం కూడా ఉంది. ఈ చిత్రం షూటింగ్ మార్చి నుండి ప్రారంభం కానుంది. తాజా సమాచారం ప్రకారం, గీతా గోవిందం లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాన్ని ఇచ్చిన డైరెక్టర్ పరుశురాం నాగచైతన్యతో చేయబోతున్న తదుపరి సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం మళ్ళీ రష్మీకాను సంప్రదించిన్నట్లు తెలుస్తోంది. మరి ఈ ఆఫర్ ను రష్మీక అంగీకరిస్తుందా లేదా అనేది చూడాలి.