
ప్రస్తుతం టాలీవుడ్ బడా హీరోలు యంగ్ టైగర్ జూ. ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లతో రాజమౌళి ఆర్ఆర్ఆర్ అనే సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ప్రారంభం అయినప్పటి నుంచి భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇద్దరు హీరోల, అభిమానులు, రాజమౌళి ఫ్యాన్స్ సినిమా కోసం వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. స్వాతంత్ర్య సమరయోధులు అల్లూరి సీతారామరాజు, కోమరం బీమ్ జీవిత చరిత్ర ఆధారంగా ఆర్ఆర్ఆర్ సినిమాను తెరకెక్కిస్తున్నారు. డీవీవీ దానయ్య నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ కోమరం బీమ్ గా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా కనిపించనున్నారు. ఎన్టీఆర్ సరసన ఒలివియా, చరణ్ సరసన అలియా భట్ నటుస్తున్నారు. తాజాగా అందుతున్న సమాచారం మేరకు న్యూ ఇయర్ సందర్భంగా రామ్ చరణ్, ఎన్టీఆర్ల ఫస్ట్ లుక్ తో పాటు సినిమా టైటిల్ ను కూడా రిలీజ్ చేయనున్నారట. అలానే ఇప్పటి నుంచి వచ్చే ప్రతి పండగకు సినిమాకు సంబంధించిన ఏదోక అప్డేట్ ఇవ్వనున్నారట . మరి ఇది ఎంత వరకు నిజమో...ఈసారైనా అప్డేట్ ఉంటుందో లేదో చూడాలి.