
ఏ మాయ చేసావే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన సమంత నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకొని అక్కినేని వారి కోడలైంది. అక్కినేని కుటుంబంలోకి వెళ్లిన క్షణం నుంచి సమంత కెరియర్ ను ఎంతో మెరుగ్గా, తెలివిగా ప్లాన్ చేసుకుంది. నటనలో ఎటువంటి కొత్త పాత్ర వచ్చిన ముందుకు దుకే సామ్ ఇప్పుడు హోస్టింగ్ లో కూడా తన సత్తా చాటి ప్రేక్షకులను మెప్పించేందుకు ప్రయత్నం చేస్తుంది. అయితే అందరి అనుమానం ఏమిటంటే మామ అక్కినేని నాగార్జునను హోస్టింగ్ లో బిట్ చేయగలదాని. నాగార్జున మిలో ఎవరు కోటీశ్వరుడు, బిగ్ బాస్ వంటి రియాల్టీ షోలకు హోస్ట్ గా వ్యవహరించి ప్రేక్షకుల దగ్గర నూటికి నూరు మార్ఖులు సంపాదించారు. మరి ఇప్పుడు మామ బాటలోకి వచ్చిన సామ్ మామను బిట్ చేసి మరి ప్రశంసలు అందుకోగలదా అనేది చూడాలి.
Tags: #Cinecolorz #Nagarjuna #Samantha