
నాచురల్ స్టార్ నాని ఒక పక్కన వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంటేనే మరోపక్క తన ప్రొడక్షన్ కంపెనీకి సెట్ అయ్యే భిన్నమైన కధల కోసం ప్రయతినిస్తూనే ఉంటాడు. ఆ మధ్య నాని నాని నిర్మాణ సంస్థ అయిన వాల్ పోస్టర్ సినిమా పతాకంపై ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన "అ!" చిత్రం విమర్శకుల ప్రశంసలను సైతం అందుకుంది. ఎన్నడూ చూడని కథతో కట్టిపడేసే స్క్రీన్ ప్లేతో మంచి హిటే పడింది. అంతేకాదు ఈ చిత్రంకు బెస్ట్ మేకప్, బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్ విభాగాల్లో నేషనల్ అవార్డ్స్ కూడా దక్కాయి. ఇక మళ్ళీ ఇన్నిరోజులకు నాని నిర్మాణంలో రెండో సినిమా రాబోతుంది. ఈ నగరానికి ఏమైంది, ఫల్కనుమా దాస్ చిత్రాలతో హీరోగా సూపరిచితుడైన విశ్వక్సేన్ హీరోగా "హిట్" అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు. కాగా విశ్వక్ హిట్ మూవీలో విక్రమ్ రుద్రరాజు అనే సీరియస్ ఐ పి ఎస్ అధికారి పాత్ర చేస్తున్నారు. ఈ మూవీ ఫస్ట్ గ్లిమ్ప్స్ వీడియో 2020 జనవరి 1న న్యూ ఇయర్ కానుకగా విడుదల చేయనున్నారు.