
మాటలతో మ్యాజిక్ చేయటంలో దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దిట్ట. జీవితం గురించి చెప్పే సత్యాలు, కడుపుబ్బా నవ్వించే పంచ్ డైలాగ్స్, ఫైట్స్ ను స్టైల్ గా చూపడం త్రివిక్రమ్ స్పెషాలిటీ. తాజాగా ఆయన దర్శకత్వంలో అల్లు అర్జున్, పూజ హెగ్డే జంటగా 'అల...వైకుంఠపురములో' తెరకెక్కింది. సంక్రాంతి కానుకగా జనవరి 12న వచ్చిన ఈ సినిమా భారీ వసూళ్లను సాధిస్థి దూసుకుపోతుంది. ఇక త్రివిక్రమ్ నెక్స్ట్ ఏ హీరోతో సినిమా చేయనున్నాడనే చర్చ జోరుగా సాగుతోంది. అయితే తాజా సమాచారం మేరకు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ నెక్స్ట్ ఆర్ఆర్ఆర్ హీరో జూ. ఎన్టీఆర్ తో చేయనున్నాడని తెలుస్తోంది. వీరి కలయికలో వచ్చిన 'అరవింద సమేత' భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఇక మరోసారి ఆ కాంబో రిపీట్ అవుతుందంటే అంచనాలు ఏ రేంజ్ లో ఉంటాయో తెలిసిందే. అయితే త్రివిక్రమ్- ఎన్టీఆర్ సినిమాను కళ్యాణ్ రామ్ ప్రొడ్యూస్ చేయనున్నట్లు సమాచారం. కానీ దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.