
విజయ్ దేవరకొండ హీరోగా క్రాంతి మాధవ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న "వరల్డ్ ఫెమస్ లవర్" టీజర్ తాజాగా రిలీజ్ అయింది. కొన్ని రోజుల ముందు సినిమాలోని నలుగురు హీరోయిన్లను పరిచయం చేస్తూ ఫస్ట్ లుక్ పోస్టర్స్ ను రిలీజ్ చేసిన చిత్ర యూనిట్ కాసేపటి క్రితం టీజర్ ను విడుదల చేసింది. ముందు నుంచి అనుకున్నట్టుగానే విజయ్ దేవరకొండ నాలుగు భిన్నమైన పాత్రల్లో కనిపించనున్నాడు. ఆ నాలుగు పాత్రలకు సంబంధించిన సన్నివేశాలను జతచేసి టీజర్ లో చూపించారు. అలానే టీజర్ లో విజయ్ దేవరకొండ ఒక సిన్ లో ఎమోషనల్ అవ్వడం చూడగానే అర్జున్ రెడ్డి సినిమా గుర్తొస్తుంది. మరి అర్జున్ రెడ్డి లానే ఉంటుందా? కధ కొత్తగా ఉంటుందా? అనేది తెలియాలి అంటే కొంతకాలం వేచి చూడాల్సిందే. గోపి సుందర్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా వాలెంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది.