
విజయ్ దేవరకొండ "వరల్డ్ ఫేమస్ లవర్" టీజర్ సోషల్ మీడియాలో, ప్రజల నుండి మిశ్రమ స్పందనలను అందుకుంది. అయితే, ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ట్రైలర్ చివరకు రిలీజ్ అయింది. ట్రైలర్ ద్వారా మేకర్స్ సినిమాను భిన్నమైన రీతిలో తీశారని అర్ధం అవుతుంది. విజయ్ తన జీవితంలో వివిధ దశలలో నాలుగు సంబంధాలలో కనిపిస్తున్నాడు. దాన్ని ట్రైలర్లో అద్భుతంగా చూపించారు. ట్రైలర్ లో బిజిఎం హైలైట్ గా నిలిచింది. రాశి ఖన్నా తన కెరీర్లో తొలిసారిగా చాలా ఎమోషనల్ పాత్రలో కనిపించింది. ఐశ్వర్య రాజేష్ విజయ్ భార్యగా నటిస్తుంది, ఆమె పాత్ర రియాలిటీకు దగ్గరగా ఉంది. క్రాంతి మాధవ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ప్రతి పాత్ర ముఖ్యమైనదిగా ఉంటుంది. ఈ చిత్రం అనుకునంత ఆసక్తికరంగా లేదని భావించిన వారందరూ ట్రైలర్ చూసిన తర్వాత వారి అభిప్రాయాన్ని మార్చుకుంటారు. ప్రేమికుల రోజు సందర్భంగా ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.