
కన్నడ సినిమా గురించి మాట్లాడుకోవడమే తక్కువైన రోజుల్లో సుడిగాలిలా వచ్చి తడాఖా చూపించిన సినిమా "కేజీఎఫ్". ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యశ్ హీరోగా వచ్చిన కేజీఎఫ్ ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి బాక్స్ ఆఫీసు రికార్డులను తిరగరాసిన చిత్రంగా కన్నడ ఇండస్ట్రీలో నిలిచిపోతుంది. కేవలం కన్నడలోనే కాక అన్ని భాషల్లో దుమ్మురేపింది. కేజీఎఫ్ సాధించిన వసూళ్లకు బాలీవుడ్ సైతం బిత్తరపోయింది. అందుకే నిర్మాతలు కేజీఎఫ్ చాప్టర్ 2 తెరపైకి తీసుకురానున్నారు. మొదటి భాగంలోనే...సినిమా మరో భాగం ఉందని హింట్ ఇచ్చిన దర్శకనిర్మాతలు ఇప్పుడు షూటింగ్ ను చకచకా జరుపుతున్నారు. మొన్నీమధ్యే కేజీఎఫ్ చాప్టర్ 2 ఫస్ట్ లుక్ రిలీజ్ అయిన విషయం తెలిసిందే. ఇక తాజాగా యశ్ 34వ పుట్టినరోజు సందర్భంగా యూనిట్ మరో పోస్టర్ ను విడుదల చేసింది. పోస్టర్ లో చేతితో సుత్తి పట్టుకొని...డైనమిక్ గా కనిపిస్తున్నాడు యశ్. చిత్ర బృందం త్వరలో టీజర్ ను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.