
నటుడు నిఖిల్ సిద్ధార్థ తన లేడీ లవ్ డాక్టర్ పల్లవి వర్మను ఈ ఏప్రిల్లో వివాహం చేసుకోబోతున్నారు. పల్లవి తన జీవితంలోకి వచ్చినందుకు నిజంగా సంతోషంగా ఉన్నానని, రెండు నెలలు ఎప్పుడు గడుస్తుందా కోసం ఎదురు చూస్తున్నానని తాజాగా ఒక దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో హీరో నిఖిల్ వెల్లడించారు. నిఖిల్ వెకేషన్ కు గోవాకు వెళ్లిన సమయంలో పల్లవిని కలిశానని, అప్పుడే ఆమెకు ప్రపోజ్ చేశానని, ఆమె నా ప్రేమను అంగీకరించిందని చెప్పాడు. తాను పెళ్లి చేసుకుంటానని ఆరు నెలల క్రితం ఎవరైనా చెప్పినా, వారిని నమ్మలేదని నిఖిల్ వెల్లడించాడు. కానీ అతను పల్లవిని కలిసిన తరువాత మొత్తం మారిపోయిందని, స్నేహితుల ద్వారా ఒక పార్టీలో పల్లవి పరిచయం అయిందని ఆమెతో మొదటి చూపులోనే ప్రేమలో పడ్డానని తెలిపాడు. గత వారాంతంలో ఈ జంటకు హైదరాబాద్లో కుటుంబ సభ్యుల మధ్య నిశ్చితార్థం జరిగింది.