
టాలీవుడ్ అయిన లేదా మరే చిత్ర పరిశ్రమ అయినా సరే ఒక సినిమా హిట్ అయినంత మాత్రనా అవకాశాలు వచ్చి పడతాయి అనడానికి లేదు. శ్రమ, పట్టుదలతో పాటు లక్ కూడా కలిసి రావాలి అనేది నిజం. అందుకే ఎంతోమంది యంగ్ హీరో, హీరోయిన్లు ఒకటి రెండు సినిమాల్లో కనిపించి ఆ తర్వాత అవకాశాలు లేక కనుమరుగు అయ్యారు. అలాంటి కోవలోకి రాకుండా జాగ్రత్తపడుతున్న యంగ్ హీరో విశ్వంత్. కేరింత, మనమంత, ఓ పిట్ట కథ ఇలా కొన్ని చెప్పుకోదగ్గ సినిమాల్లో నటించిన ఈ యంగ్ నటుడు ఇప్పుడు చిక్కుల్లో పడ్డాడు. ఈ హీరోపై బంజారాహిల్స్ లో కేసు నమోదు అయింది. తక్కువ ధరకే కార్లు ఇప్పిస్తానంటూ మోసం చేసాడని కేసు నమోదు చేసారు. ఫిర్యాదు తీసుకున్న పోలీసులు విశ్వంత్ ను విచారించేందుకు సిద్ధమవుతున్నారు.
Tags: #Cinecolorz #Tollywood #Vishwanth