
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ రాబోయే ప్రాజెక్ట్ కోసం త్రివిక్రమ్ మాటల మాంత్రికుడు తో సహకరించబోతున్నట్లు తెలిసింది. ఇప్పుడు చిత్ర పరిశ్రమలో సరికొత్త సమాచారం ప్రకారం, జూనియర్ ఎన్టిఆర్ నటించబోయే తన తదుపరి దర్శకత్వ వెంచర్ లో నందిమూరి బాలకృష్ణను ఫ్రెమ్ లోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నాడట త్రివిక్రమ్ శ్రీనివాస్. ఈ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ తండ్రి పాత్రలో బాలకృష్ణ నటించాలని త్రివిక్రమ్ శ్రీనివాస్ కోరుకుంటున్నారు. నందమూరి అభిమానులు బాలకృష్ణ మరియు జూనియర్ ఎన్టీఆర్ ల కాంబోను తెరపై చూడటానికి ఆసక్తిగా ఉన్నప్పటికీ, ఇప్పుడు ఈ ఇద్దరు తారలు కనీసం సినిమా కార్యక్రమాలలో కూడా కలిసి కనిపించరు. మరి త్రివిక్రమ్ శ్రీనివాస్ బాలకృష్ణను ఎలా ఒప్పిస్తారో వేచి చూడాలి. ఇకపోతే ప్రస్తుతం ఎన్టీఆర్, ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'ఆర్ఆర్ఆర్' లో కొమరం భీం గా నటిస్తున్నాడు. భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఈ ఏడాదిలో రిలీజ్ కానుంది.