
నందమూరి తారకరామారావు గారి మనవడిగా తెలుగు ఇండస్ట్రీలోకి చిన్న వయసులో వచ్చి తనకంటూ ప్రత్యేకమైన క్రే, గుర్తింపు, ఫ్యాన్ బేస్ ను సంపాదించుకోని... తాతకు తగ్గ మనవడిగా పేరు తెచ్చుకున్నాడు జూ. ఎన్టీఆర్. అయితే ఎన్టీఆర్ కనిపిస్తే చాలు అని ఎదురు చూసే అభిమానులకు తాజాగా ఆ అవకాశం హీరో నందమూరి కళ్యాణ్ రామ్ ద్వారా దక్కింది. కళ్యాణ్ రామ్, మెహరిన్ జంటగా నటించిన 'ఎంత మంచివడవురా' సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్ కు అతిధిగా వచ్చాడు ఎన్టీఆర్. ఇక అన్నా తమ్ముళ్లను ఒకే వేదికపై చూడొచ్చని ఫ్యాన్స్ పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఎప్పుడు, ఎటువంటి సందర్భంలోనైనా ప్రశాంతంగా ఉండే ఎన్టీఆర్ ఈసారి మాత్రం ఓపికను కోల్పోయారు. స్టేజ్ పైకి వచ్చిన కళ్యాణ్ రామ్ స్పీచ్ ఇస్తుండగా ఫ్యాన్స్ అరుస్తుండటంతో కళ్యాణ్ రామ్ తన స్పీచ్ ను తొందర్గా ముగించారు. ఆ తరువాత మైక్ తీసుకున్న ఎన్టీఆర్....మీరు ఇలానే అరుస్తూ ఉంటే నేను ఇక్కడ నుంచి వెళ్లిపోతానని హెచ్చరించారు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ పై ఇలా ఫైర్ అవ్వడంతో అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు.