Top News Today

దేశీ స్టాక్‌మార్కెట్లు లాభాల్లో ప్రారంభమైనాయి. ఇన్వెస్టర్ల కొనుగోళ్లతో సెన్సెక్స్ ఆరంభంలోనే 173 పాయింట్లు ఎగిసి తొలిసారిగా 40 వేల స్థాయిని టచ్ చేసింది. నిప్టీ 60 పాయింట్లకు పైగా లాభపడి 11, 850 ని టచ్ చేసింది. ప్రస్తుతం స్వల్పంగా వెనక్కి తగ్గినా స్థిరంగా కొన సాగుతున్నాయి. అటు బ్యాంక్‌నిఫ్టీ కూడా 30వేల మార్క్‌ను తాకింది. భారతి ఎయిర్టెల్, ఇన్ఫోసిస్, ఎల్ అండ్‌టీ, హెచ్డీఎఫ్సీ, భారతి ఇన్ఫ్రాటెల్, ఐవోసీ, అల్ట్రాటెక్, అదానీ పోర్ట్స్, యస్‌బ్యాంకు, సన్‌ఫార్మ, కోటక్ మహీంద్ర లాభపడుతున్నాయి. సిప్లా, టాటా మోటార్స్, ఐషర్ మోటార్స్, ఓన్జీసీ, ఎం అండ్ ఎం మారుతి, ఐసీఐసీ నష్టపోతున్నాయి.
Gallery
Videos
Miratchi Teaser
Top Article of the week

పసిడి ధర తగ్గుతూ వస్తోంది. హైదరాబాద్ మార్కెట్లో గత మూడు రోజుల్లో ఏకంగా బంగారం ధర రూ.300 పడిపోయింది. ఈ రోజు మంగళవారం కూడా ఇదే ట్రెండ్ కొనసాగింది. పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.50 తగ్గింది. దీంతో ధర రూ.39,550కు దిగొచ్చింది. అంతర్జాతీయంగా బలహీనమైన ట్రెండ్ సహా దేశీ జువెలర్ల, కొనుగోలుదారుల నుంచి డిమాండ్ మందగించడంతో బంగారం ధరపై ప్రతికూల ప్రభావం ఉండిపోయిందని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు.
అదేసమయంలో 10 గ్రాముల 22 కార్యెట్ల బంగార ధర కూడా రూ.50 తగ్గింది. దీంతో ధర రూ.36,250కు దిగొచ్చింది. ఇకపోతే బంగారం ధర తగ్గితే, వెండి ధర మాత్రం పైకి నడిచింది. రూ.50 పెరిగింది. దీంతో కేజీ వెండి ధర రూ.48,700కు చేరింది.