కే జి ఎఫ్ 2 సినిమాతో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న రవీనా టాండన్ వారసురాలు రాషా తడానీ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు.
రాషా తడానీ ప్రస్తుతం తెలుగు తెరకు పరిచయమవుతూ నటిస్తున్న చిత్రం శ్రీనివాస మంగాపురం. మహేష్ బాబు సోదరుడు దివంగత నటుడు రమేష్ బాబు వారసుడి కొడుకు అయిన జయ కృష్ణ హీరోగా ఇండస్ట్రీకి తొలి పరిచయం అవుతూ వస్తున్న చిత్రం ఇది.
ఇందులో మంగ అనే పాత్రలో ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి సిద్ధమైంది ఈ ముద్దుగుమ్మ. పైగా ఈ సినిమా నుండి విడుదల చేసిన టీజర్, పాటలు , ట్రైలర్ కూడా సినిమాపై అంచనాలు పెంచేసాయి.
జూలై 30వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో అటు రాషా తడానీ తన వంతుగా ప్రమోషనల్ కార్యక్రమాలను మొదలుపెట్టింది.
అందులో భాగంగానే తాజాగా వైట్ కలర్ స్లీవ్ లెస్ మిడీ ధరించిన ఈమె.. తేనె కళ్ళతో నవ్వుతూ కుర్రాళ్లను తన వైపు లాగేసుకుంది.
మరొకవైపు శ్రీనివాస మంగాపురం సినిమాలో మంగ లుక్కుని ఇంస్టాగ్రామ్ వేదికగా షేర్ చేస్తూ నేను మీ మంగని అంటూ ఇంట్రడ్యూస్ చేసింది. మొత్తానికైతే ఈమె షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.