కంటెంట్ క్రియేటర్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న నిహారిక ఎన్ ఎం గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు.
అందంతో , అభినయంతో చలాకీతనంతో అందరి దృష్టిని ఆకట్టుకుని , స్టార్ సెలబ్రిటీలను మొదలుకొని స్టార్ క్రికెటర్ల వరకు ఎంతో మందితో ఇంటర్వ్యూలు చేసి మరింత పాపులారిటీ సొంతం చేసుకుంది.
ముఖ్యంగా అడవి శేష్ , మహేష్ బాబు లాంటి స్టార్ హీరోలతో కలిసి సినిమా ప్రమోషన్స్ లో భాగంగా యాడ్స్ లో కూడా నటించి అందరిని ఆకట్టుకుంది.
ఇక ఈమధ్య సినిమాలలోకి కూడా అడుగుపెట్టింది నిహారిక. తమిళంలో పలు చిత్రాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న ఈమె.. ఇటు బాలీవుడ్ లో కూడా అవకాశాలు అందుకుంటున్నట్లు సమాచారం.
ఇకపోతే ఇంస్టాగ్రామ్ వేదికగా నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే నిహారిక తాజాగా అందాల ఆరబోస్తూ కొన్ని ఫోటోలను ఇంస్టాగ్రామ్ వేదికగా షేర్ చేసింది.
షోల్డర్ లెస్ బ్లాక్ బాడీ ఖాన్ టాప్ ధరించిన ఈమె దీనికి కాంబినేషన్లో మల్టీకలర్ బాటమ్ వేర్ తో తన అందాన్ని ఫుల్ ఫీల్ చేసుకుంది. ఇకపోతే షోల్డర్ లెస్ అందాలతో అభిమానులను ఉక్కిరిబిక్కిరి చేసింది నిహారిక.