పటాస్, అదుర్స్ వంటి షోలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న శ్రీముఖి గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. తన అద్భుతమైన వాక్చాతుర్యంతో అందరి దృష్టిని ఆకర్షించింది ఈ ముద్దుగుమ్మ.
ఒకవైపు షోలలో నటిస్తూనే.. మరొకవైపు అవార్డు ఫంక్షన్లలో కూడా హోస్ట్ గా వ్యవహరిస్తూ.. అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హోస్ట్ జాబితాలో ఒకరిగా చేరిపోయింది.
ఇకపోతే అప్పుడప్పుడు నటిగా ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈమె.. ఇటీవల నందిని రెడ్డి దర్శకత్వంలో సమంత లీడ్ రోల్ పోషిస్తూ వచ్చిన మా ఇంటి బంగారం సినిమాలో ఏకంగా సమంతా కి తోడికోడలుగా కనిపించి మెస్మరైజ్ చేసింది.
ముఖ్యంగా సమంత, శ్రీముఖి మధ్య వచ్చే సన్నివేశాలు సినిమాకి హైలెట్గా నిలిచాయి. ఇక తన అద్భుతమైన పర్ఫామెన్స్ తో అందరి దృష్టిని ఆకట్టుకుంది.
ఇప్పుడు మళ్లీ గెట్ బ్యాక్ అయిన శ్రీముఖి వరుస షోలతో బిజీగా మారిపోయింది. ఇక అందులో భాగంగానే తాజాగా తన గ్లామర్ టచ్ తో ఆడియన్స్ ను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. కాటుక కళ్ళతో రెడ్ కలర్ అవుట్ ఫిట్ ధరించి తన సరికొత్త అందాలతో ప్రేక్షకులకు గిలిగింతలు పెట్టింది.
ఏది ఏమైనా శ్రీముఖి తాజాగా షేర్ చేసిన ఈ ఫోటోషూట్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటుంది.