Peddi Song: ఏఆర్ రెహమాన్.. ఈ పేరుకు పరిచయం అక్కరలేదు. ఆస్కార్ విజేతగా ప్రపంచం మొత్తానికి ఆయన తెలుసు. ఒకప్పుడు ఏఆర్ రెహమాన్ (AR Rahman) నుంచి పాట వస్తుందంటే, గ్యారంటీగా చార్ట్‌బస్టర్ అయ్యేది. కానీ, ఈ మధ్యకాలంలో ఆ మ్యాజిక్ మిస్ అయిందనే చెప్పాలి. చాలా కాలంగా, ఏఆర్ రెహమాన్ సంగీతం మాట్లాడటం మానేసింది. మళ్లీ ఆయనని బ్యాక్‌కి తీసుకువచ్చింది చిత్రం ఏదంటే మాత్రం ‘రాయన్’ (Raayan) అనే చెప్పాలి. ఆ సినిమాలోని ‘తలవంచి’ అనే పాటలో రెహమాన్ హమ్మింగ్ చాలాకాలం పాటు జనాలను హంట్ చేసింది. ఇప్పటికీ ఆ పాట వస్తుంటే నిలబడి వినేవాళ్లు ఉన్నారు. ఆ సినిమా తర్వాత మళ్లీ రెహమాన్ ఈజ్ బ్యాక్ అనేలా చేసిన సినిమా అంటే.. ‘పెద్ది’నే.
మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియా ప్రాజెక్ట్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Mega Power Star Ram Charan) హీరోగా, ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సానా (Buchi Babu Sana) రూపొందిస్తున్న ‘పెద్ది’ (Peddi) సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబినేషన్‌లో సినిమా అంటేనే.. నిజమా! అని అంతా ఆశ్చర్యపోయారు. అలాంటిది ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అనగానే.. సినిమాపై అంచనాలు ఆకాశానికి చేరాయి. అందుకే ‘పెద్ది’ సినిమా మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌గా రోజురోజుకూ అంచనాలను పెంచుకుంటుంది. ఆ అంచనాలను ‘చికిరి చికిరి’ డబుల్ చేసింది. ‘పెద్ది’ ఫస్ట్ సింగిల్‌గా వచ్చిన ‘చికిరి’ పాట క్రియేట్ సంచలనం గురించి అందరికీ తెలిసిందే. ఎక్కడ విన్నా ఆ సాంగే. అంతా బాగా కలిసి రావడంతో, ఆ సాంగ్ రికార్డులు క్రియేట్ చేస్తూ దూసుకెళ్లింది.
Also Read- OG Movie: ‘ఓజీ’కి గద్దర్ అవార్డు ఇవ్వకూడదని ఫిక్సయ్యారా?
అడిక్షన్‌లా – Peddi Song
ఇక ఆ సాంగ్ (Peddi Song) తర్వాత రెహమాన్ నుంచి వచ్చే సాంగ్ ఎలా ఉంటుంది? అంతకంటే గొప్పగా ఉంటుందా? అని అందరిలో అనుమానాలు మొదలయ్యాయి. ఆ అనుమానాలను పటాపంచల్ చేస్తూ.. ‘రై రై రా రా’ అంటూ రెహమాన్ సృష్టిస్తోన్న బీభత్సం అంతా ఇంతా కాదు. ఇంకా చెప్పాలంటే, ఇప్పుడీ పాట ఒక అడిక్షన్‌లా మారిపోయింది. ఎక్కడ విన్నా ఈ పాటే, ఈ వీడియో చూసినా ఈ పాటకు సంబంధించిన రీల్సే. ఏ గేమ్ ప్రమోషన్ చూసినా ఈ పాటతోనే.. అలా మొత్తం మారిపోయింది. రీసెంట్‌గా జరిగిన టీ20 క్రికెట్ వరల్డ్ కప్ ప్రమోషన్ కోసం కూడా ‘రై రై రారా’ను వాడేశారంటే.. ఏ రేంజ్‌లో ఈ పాట జనాల్లోకి వెళ్లిందో అర్థం చేసుకోవచ్చు. వాస్తవానికి ఈ పాట విడుదలకు ముందు పాట రచయిత అనంత శ్రీరామ్ కూడా ఇదే చెప్పారు.
సంకల్పం గొప్పది
నా పాట విని ఆత్మహత్యను విరమించుకునే సందర్భం రావాలి. అలాంటి పాట రాస్తే నా రచన సార్థకమైనట్లే అని.. ఇటీవల ఓ ఇంటర్వ్యూ అనంత శ్రీరామ్ అన్నారు. నిజంగా ఆ మాట వెనుక చాలా అర్థం ఉంది. ఒక రచయితగా అంతకంటే గొప్ప సందర్భం ఏముంటుంది. అలాంటి సందర్భాన్ని నిజంగా ఈ పాట ఇచ్చిందనే చెప్పాలి. పూరి గుడిసెలో ఉండే వాడికి కూడా నా పాట రీచ్ కావాలి. వాళ్లు కూడా ఈ పాట మనకోసమే రాశారనుకోవాలి.. అనే సంకల్పంతో ఈ పాట రాయడం జరిగిందని తెలిపారు. నిజంగా ఆయన సంకల్పం గొప్పది. ఆయన అనుకున్న వాళ్లకి కూడా ‘రై రై రా రా’ రీచ్ అవుతుంది. దాదాపు రెండు నెలల సమయం తీసుకున్నా, పరాయి భాషల ప్రభావం లేని అచ్చమైన తెలుగు పాటతో అనంత శ్రీరామ్ తన ప్రతిభను ప్రదర్శించారు.
Also Read- Varalaxmi: తమిళ్ కాదు.. తెలుగు రాజకీయాల్లోకే రావచ్చేమో!
రిపీటెడ్ మోడ్‌లో
అనంత శ్రీరామ్ తర్వాత ఈ పాట విషయంలో చెప్పుకునే పేరు ఏఆర్ రెహమాన్. సాహిత్యానికి సరైన స్వరం తోడైతేనే.. పాట చార్ట్‌బస్టర్ అవుతుంది. అదే ఈ పాటకు జరిగింది. పవర్ ఫుల్ డ్యాన్స్ నంబర్ పల్సేటింగ్ బీట్స్, ఇన్‌ఫెక్షియస్ రిథమ్‌తో వచ్చిన ఈ పాటకు రెహమాన్ గాత్రం కూడా తోడవ్వడంతో.. మాస్ ఎనర్జీకి కేరాఫ్ అడ్రస్‌గా మారింది. రెహమాన్ సంగీతానికే కాదు, ఆయన గాత్రానికి కూడా పిచ్చ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆయన ఏ పాట పాడినా, చివరికి చిన్న హమ్మింగ్ చేసినా.. అది ప్రపంచం మొత్తానికి చిటికెలో రీచ్ అవుతుంది. వరల్డ్‌ని ఊపేస్తుంది. అదే ఈ ‘రై రై రా రా’కు సెట్టయింది. రిపీటెడ్ మోడ్‌లో ఈ పాట మారుమోగుతోంది. అందుకే అంటుంది.. రెహమాన్ ఈజ్ బ్యాక్ అని. రెహమాన్ పాటకు ఇలాంటి స్పందన వచ్చి నిజంగానే చాలా కాలం అవుతుంది. థమన్, థమన్ అని నామస్మరణ చేస్తున్న టాలీవుడ్ ఇండస్ట్రీకి కూడా మంచి ఛేంజ్ లభించింది.
The date of his arrival changes, but not his MIGHTY GRIT ❤️🔥
#PEDDI WORLDWIDE RELEASE ON 30th APRIL, 2026. pic.twitter.com/i3cRB0fCVg
— PEDDI (@PeddiMovieOffl) February 4, 2026
ఎంత చెప్పుకున్నా తక్కువే
ఇంకా ఈ పాట విషయంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. తన ట్రేడ్‌మార్క్ మాస్ ఎనర్జీ, గ్రేస్‌ఫుల్ ఫిట్‌నెస్‌తో చరణ్ ఈ పాటని వాడవాడకు చేరేలా చేశారు. ఆయన ఫ్లూయిడ్ మూవ్‌మెంట్స్, పవర్‌ఫుల్ ఫుట్‌వర్క్, కరిస్మాటిక్ ఎక్స్‌ప్రెషన్స్ ఈ పాటను ఇన్‌స్టంట్ చార్ట్‌బస్టర్‌గా మార్చేశాయంటే అసలు అతిశయోక్తి కానే కాదు. ఈ క్రమంలో జానీ మాస్టర్‌కు కూడా క్రెడిట్ ఇవ్వాలి. పాట విడుదలైన రోజు, చాలా మంది ఇవేం స్టెప్స్ అనుకున్న వాళ్లే, బాబోయ్ ఇలా ఎలా కంపోజ్ చేశాడంటూ ఆశ్చర్యపోతున్నారంటే.. జానీ మాస్టర్ ఈ పాట కోసం ఎంతగా తపించాడో అర్థం చేసుకోవచ్చు. ఇక అన్నింటికీ మించి, బుచ్చిబాబు సంకల్పం ఇక్కడ చాలా గొప్పది.
Also Read- Ustaad Bhagat Singh: దేవి శ్రీ ప్లేస్‌లోకి థమన్.. అసలేం జరిగిందంటే?
క్రెడిట్ బుచ్చిబాబుకే
‘ఈ పాట ఎలా ఉండాలి అని అనుకున్నప్పుడు యూత్‌కి ఒక యాంథమ్ లాగా ఉండాలి అని డైరెక్టర్ బుచ్చిబాబు చెప్పారు. ఆ మాట నాకు తారకమంత్రం లాగా పనిచేసింది’ అని లిరిసిస్ట్ అనంత శ్రీరామ్ చెప్పారు. ‘‘నిజానికి ఇది ఒక ప్రేమ పాట కాదు, ఐటెం సాంగ్ కాదు.. అయినప్పటికీ ప్రతి ఒక్కరూ ఇంతులోని సాహిత్యం గురించి మాట్లాడుతున్నారు.. దీనికి కారణం ఈ పాట సాహిత్యం ఇలా రావాలన్న దర్శకుడి సంకల్పం. బుచ్చిబాబు సాహిత్యానికి చాలా ప్రాముఖ్యత ఇస్తారు. ఈ పాటలో ఎలాంటి సాహిత్యం ఉండాలనే దానిపై బుచ్చిబాబు, నేను చాలా సమయం కేటాయించాం. చాలా రాత్రులు రింగ్ రోడ్డు మీద అలా డ్రైవ్ చేస్తూ, కాఫీ షాపుల్లో కూర్చుని చాలా చర్చించాం. అలా నెలలు తరబడి మదనపడితే వచ్చిన పాట ఇది’’ అని అనంత శ్రీరామ్ తన తాజా ఇంటర్వ్యూలో చెప్పారంటే, ఈ పాట క్రెడిట్‌లో అగ్ర భాగం బుచ్చిబాబుకే ఇవ్వక తప్పదు.
ఇంకా 3 పాటలు
ఏదిఏమైనా, ఏఆర్ రెహమాన్ మరోసారి ‘పెద్ది’ సాంగ్స్‌తో తనేంటో నిరూపిస్తున్నారు. ఇంకా ఈ సినిమా నుంచి 3 పాటలు వస్తాయని చిత్ర బృందం తెలుపుతోంది. ఈ మూడు పాటలు ఎలా ఉంటాయో? అని ఆయన అభిమానులు వేచి చూస్తున్నారు. ఈ మూడు సాంగ్స్ కూడా చార్ట్ బస్టర్ కొడితే.. పాన్ ఇండియా వైడ్‌గా కొన్నాళ్ల పాటు రెహమాన్ పేరు మారుమోగడం ఖాయం. ఏప్రిల్ 30న విడుదలకు సిద్ధమవుతోన్న ఈ చిత్రాన్ని వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా రామ్ చరణ్ కెరీర్‌కు కూడా ఎంతో కీలకమనే విషయం తెలియంది కాదు. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో శివ రాజ్ కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ, బొమన్ ఇరానీ వంటి వారు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పిస్తున్నారు.
Also Read- Virosh Wedding: విజయ్, రష్మికల ప్రేమ నుంచి పెళ్లి రిసెప్షన్ వరకు.. జరిగింది ఇదే!

