Friday, April 10, 2026
HomeMOVIE NEWSBiker Movie: శర్వా ‘బైకర్’ రాంగ్ టైమ్‌లో రిలీజైందా?

Biker Movie: శర్వా ‘బైకర్’ రాంగ్ టైమ్‌లో రిలీజైందా?

Biker Movie: సంక్రాంతికి వచ్చిన ‘నారీ నారీ నడుమ మురారి’తో మంచి హిట్ కొట్టిన ఛార్మింగ్ స్టార్ శర్వానంద్, ఇప్పుడో మంచి అవకాశాన్ని మిస్ చేసుకున్నారు.

on

Biker Movie: సంక్రాంతికి వచ్చిన ‘నారీ నారీ నడుమ మురారి’ (Naari Naari Naduma Murari)తో మంచి హిట్ కొట్టిన ఛార్మింగ్ స్టార్ శర్వానంద్ (Sharwanand), ఇప్పుడో మంచి అవకాశాన్ని మిస్ చేసుకున్నారు. అవును, ఆయన హీరోగా నటించిన ‘బైకర్’ (Biker Movie) చిత్రం తాజాగా విడుదలై, మంచి టాక్‌ని సొంతం చేసుకుంది కానీ, కలెక్షన్స్ పరంగా మాత్రం, అనుకున్నంతగా రాబట్టలేకపోతుంది. కారణం, ఈ సినిమా రాంగ్ టైమ్‌లో రిలీజ్ కావడమే. అవును, ఈ సినిమా కనుక సంక్రాంతి రేసులో, లేదంటే, దసరా బరిలో దిగి ఉంటే మాత్రం సెన్సేషనల్ హిట్‌గా నిలిచేది. కానీ ఇప్పుడా అవకాన్ని ఈ సినిమా మిస్ చేసుకుంది. రాంగ్ టైమ్‌లో రిలీజ్ కావడంతో, సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చినా, ప్రేక్షకులను థియేటర్లకు రప్పించలేకపోతుంది.

Also Read- Bad Boy Karthik: ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’ ట్రైలర్ ఎలా ఉందంటే?

ఐపీఎల్ ఎఫెక్ట్

వాస్తవానికి వేసవి అనేది రాంగ్ టైమ్ కాదు, సంక్రాంతి తర్వాత సినిమాలకు మంచి ఛాయిస్ వేసవి అనే విషయం తెలియంది కాదు, కానీ, కొన్నాళ్లుగా వేసవి ట్రీట్‌ని దర్శకనిర్మాతలకు లేకుండా చేస్తుంది మాత్రం ఐపీఎల్ (IPL 2026) అనే చెప్పుకోవాలి. కరెక్ట్‌గా వేసవి మొదలయ్యే సమయానికే, ఐపీఎల్ కూడా మొదలవ్వడంతో, ఆ ఎఫెక్ట్ సినిమాలపై బాగా పడుతోంది. అందుకే ఒకప్పుడు వేసవికి స్టార్ హీరోల సినిమాలు టార్గెట్‌గా ఉండేవి. కానీ, ఐపీఎల్ వచ్చిన తర్వాత.. వేసవిలో స్టార్ హీరోల సినిమాలేవీ పెద్దగా విడుదల కావడం లేదు. కారణం, కలెక్షన్లపై ఆ ఎఫెక్ట్ పడుతుండటమే. ఇప్పుడదే శర్వానంద్ సినిమాపై కూడా పడింది.

ధురంధర్ 2 ఎఫెక్ట్

ఇక మరో కారణం బాలీవుడ్ సినిమా ‘ధురంధర్ 2’ (Dhurandhar 2). రణ్వీర్ సింగ్, ఆదిత్య ధర్ కాంబినేషన్‌లో వచ్చిన ‘ధురంధర్ 2’ చిత్రం ప్రేక్షకులను కమ్మేసింది. ఇప్పుడప్పుడే ఈ సినిమా ప్రభంజనం తగ్గేలా లేదు. దేశవ్యాప్తంగా ఈ సినిమా కలెక్షన్ల సునామీ సృష్టిస్తూ థియేటర్లలో దూసుకెళుతోంది. సౌత్‌లోనూ ఈ సినిమాకు కలెక్షన్స్ భారీగా వస్తుండటం, జనాలు ఈ సినిమా చూసేందుకు ఎగబడుతుండటంతో, పోటీగా వచ్చిన సినిమాలపై ఆ ఎఫెక్ట్ తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ సినిమా ధాటికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా కూడా చేతులెత్తేసింది. ఈ రెండు సినిమాలు ఒకే రోజు విడుదలైన విషయం తెలిసిందే. కానీ, ‘ధురంధర్ 2’ దెబ్బకి ‘ఉస్తాద్’ దుకాణం సర్దేయాల్సి వచ్చిందంటే, ఆ సినిమా ఎంతగా ప్రభావం చూపుతుందో అర్థం చేసుకోవచ్చు.

Also Read- Rakasa Movie Review: ‘రాకాస’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్

రాంగ్ టైమ్‌లో రిలీజ్ (Biker Movie)

‘ధురంధర్ 2’ మూవీ రిలీజ్ తర్వాత చాలా సినిమాలు థియేటర్లలోకి వచ్చాయి కానీ, ఏ సినిమా థియేటర్లలో నిలబడలేదు. ఇప్పుడు ‘బైకర్’, ‘రాకాస’ చిత్రాలపై కూడా ఈ ఎఫెక్ట్ కనబడుతోంది. ఈ వారం మరో మూడు సినిమాలు విడుదలవుతున్నాయి. ఈ సినిమాలలో ఏదైనా క్లిక్ అయితే మాత్రం, ప్రస్తుతం వస్తున్న కలెక్షన్స్ కూడా ‘బైకర్’పై పడే అవకాశం లేకపోలేదు. ఎలా చూసినా, ‘బైకర్’ రాంగ్ టైమ్‌లో రిలీజ్ అయిందనే చెప్పుకోవాలి. సినిమా బాగున్నప్పటికీ, రాంగ్ టైమ్‌లో రిలీజ్ కావడంతో.. ఈ సినిమా బ్రేకీవెన్ అవడం కూడా కష్టమే అనేలా పరిస్థితి మారింది. ‘నారీ నారీ నడుమ మురారి’కి ముందు వరుస ఫ్లాప్స్‌తో సతమతమవుతున్న శర్వాకు, ఆ సినిమా కొత్త ఊపిరినిచ్చింది.

బ్రేకీవెన్ కష్టమేనా?

అదే సక్సెస్‌ను ‘బైకర్’తో కంటిన్యూ చేస్తానని ప్రతి ఈవెంట్‌లో శర్వానంద్ చెబుతూ వస్తున్నారు. ఆయన చెప్పినట్టే సినిమాకు మంచి టాక్ వచ్చినా, కలెక్షన్స్ పరంగా మాత్రం ఈ సినిమా లాస్ ప్రాజెక్ట్‌గానే నిలిచే అవకాశం ఉంది. మాళవిక నాయర్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో యాంగ్రీ మ్యాన్ రాజశేఖర్ పవర్ ఫుల్ పాత్రని పోషించారు. అభిలాష్ రెడ్డి దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించింది. భారతదేశపు మొట్టమొదటి కంప్లీట్ మోటో క్రాస్ డ్రామాగా రూపొందిన ఈ సినిమా ఏప్రిల్ 3న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వచ్చింది. జిబ్రాన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.

Also Read- Varalaxmi: తమిళ్ కాదు.. తెలుగు రాజకీయాల్లోకే రావచ్చేమో!

ఇండస్ట్రీ ఫుల్ సపోర్ట్

ఇక ఈ ‘బైకర్’ సినిమా కోసం, యూవీ క్రియేషన్స్ కోసం రెబల్ స్టార్ ప్రభాస్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వంటి వారంతా ప్రమోషన్స్ చేసిన విషయం తెలిసిందే. ప్రభాస్ అయితే ఏకంగా ఓ వీడియోను కూడా చేశారు. రామ్ చరణ్ ట్విట్టర్ వేదికగా సినిమా యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఇక సినిమా విడుదల తర్వాత ఇండస్ట్రీ నుంచి కూడా మంచి సపోర్ట్ లభించింది. యంగ్ హీరోలు, దర్శకులు ఈ సినిమా బ్లాక్ బస్టర్ అంటూ సోషల్ మీడియా వేదికగా యూనిట్‌కు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. సినిమాకు వచ్చిన సక్సెస్‌తో యూనిట్ కూడా చాలా హ్యాపీగా ఉంది. ఒక సినిమాకు ఈ మధ్య కాలంలో ఇంతగా సపోర్ట్ అయితే రాలేదనే చెప్పుకోవాలి. అలాంటి గొప్ప సపోర్ట్ ఈ సినిమాకు లభించింది.

సక్సెస్ గర్వమా?

శర్వానంద్ కూడా ఈ సినిమా ప్రమోషన్స్‌లో చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ అందరినీ ఆకర్షిస్తున్నారు. కొంతమేరకు ట్రోలింగ్‌కు కూడా గురవుతున్నారు. మరీ ముఖ్యంగా రీసెంట్‌గా ఆయన అటెండ్ అయిన ఓ వేడుకలో మాట్లాడిన మాటలు బాగా వైరల్ అవడమే కాకుండా, కాంట్రవర్సీగా కూడా మారాయి. అందరూ శర్వాను తప్పుపడుతూ, సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. నిజంగా, శర్వా కష్టపడి ఉండొచ్చు కానీ, అంతగా ఫీలైపోవాల్సిన అవసరం అయితే లేదు. మరి ఎందుకు అలా చేశాడనేది మాత్రం ఆయనకే తెలియాలి. ఇలా చేయడం వల్ల, తన తదుపరి సినిమాల విషయంలో మరింత ట్రోలింగ్‌కు గురయ్యే అవకాశం కూడా లేకపోలేదు. సక్సెస్ వచ్చినప్పుడు, ఎంతో వినయంతో ఉండాలని చిరంజీవి వంటి పెద్దలు ఎప్పుడూ చెబుతుంటారు. ఆ సక్సెస్‌ని తలకి ఎక్కించుకుంటే తర్వాత ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుందని శర్వానంద్ ఎప్పటికి తెలుసుకుంటాడో?

Also Read- Ustaad Bhagat Singh Review: పవర్ స్టార్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ హిట్టా? ఫట్టా?

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

You might also likeRELATED
Recommended to you