Friday, April 3, 2026
HomeREVIEWSRakasa Movie Review: ‘రాకాస’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్

Rakasa Movie Review: ‘రాకాస’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్

Rakasa Movie Review: మెగా డాటర్ నిహారిక కొణిదెల పింక్ ఎలిఫెంట్స్ బ్యానర్‌ స్థాపించి, నిర్మాతగా చేసిన మొదటి సినిమాతోనే ఎన్నో అవార్దులను గెలుచుకుంది. సినిమా కూడా

on

మూవీ పేరు: ‘రాకాస’ (Rakasa Movie)
నటీనటులు: సంగీత్ శోభన్, నయన్ సారిక, గెటప్ శ్రీను, బ్రహ్మాజీ, తనికెళ్ల భరణి, ఆశిష్ విద్యార్థి, వెన్నెల కిషోర్ తదితరులు
విడుదల తేదీ: 03 ఏప్రిల్, 2026
సినిమాటోగ్రఫీ: రాజు ఎడురోలు
ఎడిటింగ్: అన్వర్ అలీ
సంగీతం: అనుదీప్ దేవ్
నిర్మాతలు: నిహారిక కొణిదెల, ఉమేశ్ కుమార్ బన్సాల్
రచన, దర్శకత్వం: మానస శర్మ

Rakasa Movie Review: మెగా డాటర్ నిహారిక కొణిదెల (Niharika Konidela) పింక్ ఎలిఫెంట్స్ బ్యానర్‌ స్థాపించి, నిర్మాతగా చేసిన మొదటి సినిమాతోనే ఎన్నో అవార్దులను గెలుచుకుంది. సినిమా కూడా మంచి సక్సెస్ సాధించడంతో పాటు, నిర్మాతగా ఫస్ట్ అటెంప్ట్‌తోనే నిహారికకు మంచి పేరు తీసుకు వచ్చింది. ఇక ఆమె నిర్మాతగా రెండో సినిమాను అనౌన్స్ చేసినప్పుడు అంతా ఆశ్చర్యపోయారు. సంగీత్ శోభన్ హీరోగా సినిమా చేస్తున్నట్లుగా ఆమె ప్రకటించారు. అంతే, మొదటి సినిమా అంతా కొత్తవాళ్లతో చేసిన నిహారిక, రెండో సినిమా మాత్రం వరుస సక్సెస్‌ల మీద ఉన్న సంగీత్‌తో ప్రకటించడంతో పాటు, ఒక లేడీ డైరెక్టర్‌తో సినిమా అనౌన్స్ చేయడంతో, మొదటి నుంచి ఈ సినిమాపై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. ఆ అంచనాలు ఎక్కడా డ్రాప్ అవకుండా, ప్రమోషనల్ కంటెంట్‌తో సినిమాపై క్రేజ్ పెంచుతూ వచ్చారు. మరి దర్శకురాలు మానస శర్మను నమ్మి, నిహారిక ఇచ్చిన ‘రాకాస’ (Rakasa) అవకాశాన్ని ఆమె ఎంత వరకు నిలబెట్టుకుంది? శుక్రవారం థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా ఎలా ఉంది? సినిమా హిట్టా? ఫట్టా? అనేది రివ్యూలో తెలుసుకుందాం.

Also Read- Ustaad Bhagat Singh Review: పవర్ స్టార్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ హిట్టా? ఫట్టా?

‘రాకాస’ మూవీ కథ:

అమెరికాలో ఉన్న వీరబాబు (సంగీత్ శోభన్)తో ఓ అమ్మాయి ప్రేమగా మాట్లాడి, కవ్విస్తుంటుంది. కొన్ని రోజుల సంభాషణ అనంతరం ఆ అమ్మాయికి పెళ్లి అయిపోతుందని తెలుసుకున్న వీరబాబు, ఎలా అయినా పెళ్లిని ఆపాలని.. అమెరికా వదిలి ఆ అమ్మాయి కోసం ఊరు వస్తాడు. ఆ పెళ్లిని ఆపాలని ఊరిలో ఉన్న స్నేహితుడు బాలు (గెటప్ శ్రీను) సహాయం తీసుకుంటాడు. ఈ క్రమంలో వారిద్దరూ కలిసి చిన్ననాటి స్నేహితురాలైన సుబ్బలక్ష్మి (నయన్ సారిక) సహాయం కూడా తీసుకుంటారు. ఈ పెళ్లీ ఆపే క్రమంలో వీరబాబు, సుబ్బలక్ష్మి మధ్య ప్రేమ పుడుతుంది. ఇంత వరకు నార్మల్‌గా నడిచిన కథ, ఒక్కసారిగా ఫాంటసీ మూడ్‌లోకి వెళుతుంది. ఆ ఊరి చివరి కోటలో ఉండే బ్రహ్మ రాక్షసుడు‌కి నరబలి ఇవ్వాల్సిన ఆనవాయితీ ఉంటుంది. మూడు సంకేతాల అనంతరం ఆ గ్రామ ప్రజలందరూ కలిసి ఒక వ్యక్తిని సెలక్ట్ చేసి, అతన్ని కోటలోకి పంపుతారు. అలా బ్రహ్మ రాక్షసుడికి కోటకి అనూహ్యంగా వీరబాబు వెళ్లాల్సి వస్తుంది. కోటలోకి వెళ్లిన వీరబాబుని బ్రహ్మ రాక్షసుడు ఏం చేశాడు? వీరబాబుని కాపాడుకోవడానికి బాలు, సుబ్బలక్ష్మి ఏమేం చేశారు? అసలు, ఆ ఊరి కోటలో ఉన్న బ్రహ్మ రాక్షసుడి వృత్తాంతం ఏమిటనేది తెలియాలంటే, థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా చూడాల్సిందే.

Also Read- Varalaxmi: తమిళ్ కాదు.. తెలుగు రాజకీయాల్లోకే రావచ్చేమో!

నటీనటుల పనితీరు:

వీరబాబు పాత్రలో సంగీత్ శోభన్ ఆకట్టుకున్నాడు. తను బాధపడుతూనే, చూస్తున్న ప్రేక్షకులను నవ్వించేందుకు ఆయన చేసిన ప్రయత్నం ఫలించిందనే చెప్పుకోవాలి. ఇప్పటి వరకు సోలోగా తన టాలెంట్‌ను నిరూపించుకునే అవకాశం రాని సంగీత్ శోభన్.. ఈ సినిమాలో మాత్రం సోలో హీరోగా చెలరేగిపోయాడు. ముఖ్యంగా సెకండాఫ్‌లో సంగీత్ అభినయం అందరినీ అలరిస్తుంది. నటుడిగా ఆయన ఒక మెట్టు ఎక్కాడనే చెప్పుకోవాలి. ఇక వరుస చిత్రాలతో ఈ మధ్య ప్రేక్షకులను పలకరిస్తున్న నయన్ సారికకు ఇందులో కూడా ఇంపార్టెన్స్ ఉన్న పాత్రే పడింది. ముఖ్యంగా సెకండాఫ్‌లో ఆమె పాత్రకు దర్శకురాలు మంచి ప్రాముఖ్యత ఉండేలా సన్నివేశాలు రాశారు. ఆమె కూడా తన అభినయంతో ఆకట్టుకుంది. ఈ రెండు పాత్రల తర్వాత సినిమాలో బాగా ఇంపార్టెన్స్ ఉన్న పాత్ర మాత్రం బాలు అదే.. గెటప్ శ్రీనుదే. అతనికి ఇందులో ఇచ్చిన స్కోప్.. ఇంతకు ముందెన్నడూ లేదనే చెప్పుకోవాలి. ఇంకా తనికెళ్ల భరణి, బ్రహ్మాజీ, వెన్నెల కిశోర్ పాత్రలకు కూడా మంచి పాత్రలు పడ్డాయి. వెన్నెల కిశోర్ ఎంట్రీ నుంచి అంతా నవ్వుతూనే ఉంటారు. ఆశిష్ విద్యార్థి చాలా రోజుల తర్వాత తెలుగు ప్రేక్షకులకు కనిపించారు. ఇంకా రోహన్ రాయ్‌తో పాటు, ఇతర ఆర్టిస్ట్‌లందరూ తమ పాత్రల పరిధిమేర మెప్పించారు.

Also Read- Virosh Wedding: విజయ్, రష్మికల ప్రేమ నుంచి పెళ్లి రిసెప్షన్ వరకు.. జరిగింది ఇదే!

సాంకేతిక నిపుణుల పనితీరు:

ఈ సినిమాకు సాంకేతిక విభాగం అత్యుత్తమ పనితీరును ప్రదర్శించిందని చెప్పుకోవాలి. మ్యూజిక్, కెమెరా, ప్రొడక్షన్ డిజైనింగ్ అన్నీ బాగా కుదిరాయి. ఎడిటింగ్ పరంగా మాత్రం ఫస్టాఫ్ ఇంకాస్త క్రిస్ప్‌గా ఉంటే బాగుండేది. నిర్మాణ విలువలన్నీ బాగున్నాయి. కథకి తగినట్లుగా ఖర్చు పెట్టారు. సెకండాఫ్‌లో గ్రాఫిక్స్ వర్క్‌కు బాగానే ఖర్చయినట్లగా అయితే అర్థమవుతోంది. ఇక దర్శకురాలికి ఉన్న అనుభవం ప్రకారం చూస్తే, ఈ అవుట్ ఫుట్ నిజంగా ఎక్స్‌పెక్ట్ చేయలేం. ఫస్టాప్ నార్మల్‌గా ఉన్నా, సెకండాఫ్ మాత్రం ఆసక్తికరంగా కథని మలిచారామె. ఎమోషనల్ సన్నివేశాలు కూడా బాగా కుదిరాయి.

Also Read- Peddi Song: రెహమాన్ ఈజ్ బ్యాక్.. ‘రైరై రారా’ అడిక్షన్!

విశ్లేషణ: (Rakasa Movie Review)

ఈ సినిమా ట్రైలర్ విడుదల వరకు సినిమాలోని ఫాంటసీ కోణం ప్రేక్షకులకు తెలియలేదు. కానీ, ట్రైలర్ విడుదల తర్వాత సినిమా చూసే కోణమే మారిపోయింది. ట్రైలర్‌లో ఉన్న మ్యాటర్ సినిమాలో ఉంటుందా? అనే దానికి తర్వాత జరిగిన ఇంటర్వ్యూలలో చెప్పిన అంశాలు పూర్తి క్లారిటీ ఇచ్చాయి. ఇక భారీగా ఊహించుకుని సినిమా థియేటర్‌లోకి అడుగు పెట్టిన ప్రేక్షకుడిని స్టార్టింగ్‌లో వచ్చే సన్నివేశాలు కొన్ని ఇబ్బంది పెట్టినా, సెకండాఫ్ నుంచి మాత్రం ఇంట్రెస్టింగ్‌గా కుర్చీలో కూర్చోబడతాయి. బ్రహ్మ రాక్షసుడు ఎపిసోడ్ పడినట్లుగా, ఫస్టాఫ్‌ని కూడా ఇంకాస్త ఆసక్తికరంగా రాసుకుని ఉంటే మాత్రం, సినిమా ఓ రేంజ్‌లో ఉండేది. కామెడీ సన్నివేశాలు కూడా సెకండాఫ్‌లోనే బాగా పండాయి. క్లైమాక్స్ గుర్తుండిపోతుంది. అంతబాగా, దర్శకురాలు సెకండాఫ్‌ని మలిచారు. ముఖ్యంగా పిల్లలకు మాత్రం ఒక చందమామ కథలా అనిపిస్తుంది. భారీగా ఊహించుకుని వెళితే కాస్త నిరాశ పరుస్తుంది కానీ, ఈ వేసవికి పిల్లలు ఎంజాయ్ చేసే కంటెంట్ మాత్రం ఇందులో దర్శకురాలు బాగానే జోడించారు. బ్రహ్మ రాక్షసుడి ఎపిసోడ్ అంతా చాలా బాగా వచ్చింది. అతిని వృత్తాంతం కూడా బాగా అల్లారు. మొత్తంగా అయితే, దర్శకురాలు ఈ కథని నడిపించడంలో మొదట్లో కాస్త తడబడినా, సినిమా పూర్తయ్యే సరికి మాత్రం మంచి ఫీలింగ్‌తో పంపించారు. డెఫినెట్‌గా ఒకసారి అయితే చూడొచ్చు.

సినీ కలర్జ్ ట్యాగ్ లైన్: సెకండాఫ్ కోసం ఫస్టాఫ్ భరించాల్సిందే!            

సినీ కలర్జ్ రేటింగ్: 2.75/5

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

You might also likeRELATED
Recommended to you