మూవీ పేరు: ఉస్తాద్ భగత్ సింగ్
విడుదల తేదీ: 19 మార్చి, 2026
నటీనటులు: పవన్ కళ్యాణ్, శ్రీలీల, రాశీ ఖన్నా, పార్తీబన్, కె.ఎస్. రవికుమార్, రావు రమేష్, గౌతమి, ఎల్బీ శ్రీరామ్ తదితరులు
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
నేపథ్య సంగీతం: ఎస్. థమన్
ఎడిటింగ్: కార్తీక్ శ్రీనివాస్
సినిమాటోగ్రఫీ: అయాంక బోస్
నిర్మాతలు: నవీన్ యెర్నేని, వై రవి శంకర్
కథ, దర్శకత్వం: హరీష్ శంకర్
Ustaad Bhagat Singh Review: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఈ పేరే ఒక వైబ్రేషన్. ఆయనకు అభిమానులు కాదు, భక్తులు ఉంటారని అంతా అంటుంటారు. అలాంటి ఒక భక్తుడే దర్శకుడు హరీష్ శంకర్. ఒక వీరాభిమానికి, తన అభిమాన హీరోని డైరెక్ట్ చేసే ఛాన్స్ వస్తే ఎలా ఉంటుందో ‘గబ్బర్ సింగ్’తో నిరూపించాడు హరీష్ శంకర్. అలాంటి కాంబినేషన్ మళ్లీ రిపీట్ అవుతుందంటే ఎలాంటి అంచనాలు ఉంటాయో, అంతకంటే ఎక్కువే ‘ఉస్తాద్ భగత్ సింగ్’పై ఏర్పడ్డాయి. పవన్ కళ్యాణ్ పొలిటికల్‌గా బిజీగా ఉండి కూడా, ఖాళీ టైమ్‌లో ఈ సినిమాను పూర్తి చేశారు. ప్రమోషన్స్ మొత్తం హరీష్ శంకర్ ఒంటి చేత్తో చేసుకుంటూ వచ్చారు. ప్రీ రిలీజ్ వేడుకలో పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) స్పీచ్ కూడా సినిమాపై క్రేజ్ ఏర్పడేలా చేసింది. సంగీత దర్శకుల విషయంలో కూడా ఈ సినిమా వార్తలలో నిలిచింది. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా సెన్సేషన్‌ని క్రియేట్ చేసిన ‘ధురంధర్’ పార్ట్ 2 పోటీకి ఉన్నా, ప్రీ పోన్ చేసుకుని మరి తెలుగు నూతన సంవత్సరానికి తెలుగు సినిమా ఉండాలని బరిలోకి దిగిన ఈ సినిమా ఎలా ఉంది? ప్రేక్షకులకు నచ్చిందా? లేదంటే అభిమానులకు కావాల్సిన స్టఫ్ మాత్రమే ఇందులో ఉందా? అనేది రివ్యూ (Ustaad Bhagat Singh Review)లో తెలుసుకుందాం.
Also Read- OG Movie: ‘ఓజీ’కి గద్దర్ అవార్డు ఇవ్వకూడదని ఫిక్సయ్యారా?
‘ఉస్తాద్ భగత్ సింగ్’ కథ ఇదే..
సినిమా స్టార్టింగ్ ఓ ఇంటెన్స్ సీన్‌తో మొదలవుతుంది.. క్లైమాక్స్ సీన్‌ని స్టార్టింగ్ సీన్‌గా చూపిస్తూ.. దానికో వివరణ ఇస్తూ సినిమా మొదలవుతుంది. కట్ చేస్తే ఓ గూడెంని చూపించి, అక్కడికి ఒక నిజాయితీ కలిగిన హెడ్ మాస్టర్‌గా చంద్రశేఖర్ రావు (కె.ఎస్. రవికుమార్) వచ్చి, అక్కడి పిల్లల్ని స్కూల్‌కి పంపించమని అడుగుతారు. అదే సమయంలో పేరులేని ఓ కుర్రాడు చేసే విన్యాసం ఆ మాస్టర్‌కు బాగా నచ్చుతుంది. ఆ కుర్రాడి గురించి తెలుసుకుని, అతడిని స్కూల్ చేర్పించి విద్యాబుద్ధులు నేర్పిస్తూ.. ‘భగత్ సింగ్’ అనే పేరు కూడా పెడతాడు. ఆ కుర్రాడు తన తాతని ‘ఉస్తాద్’ అని పిలిచేవాళ్లని, దానిని తన పేరుకు తగిలించుకుంటారు. అతడే ‘ఉస్తాద్ భగత్ సింగ్’ (పవన్ కళ్యాణ్). ఆ హెడ్ మాస్టర్‌కు పొలిటికల్ పార్టీ నుంచి పిలుపు రావడం, సీఎం అవడం చకా చకా జరిగిపోతాయి. స్కూల్ చదివే సమయంలోనే ఎప్పుడు పిలిస్తే అప్పుడు రావాలని ఆ కుర్రాడు దగ్గర మాట తీసుకున్న మాస్టర్‌ని ‘ఉస్తాద్ భగత్ సింగ్’ అడుగడుగునా రక్షించుకుంటూ వస్తుంటాడు. అదే సమయంలో సీఎం పీఠం కోసం పేరులోనే సీఎం అని ఉన్న చెదల మర్రి నల్ల నాగప్ప (పార్తిబన్).. టెర్రరిస్ట్‌లతో చేతులు కలిపి మొత్తం తన చేతుల్లోకి తీసుకోవాలని చూస్తాడు. అతని ఎత్తులను ‘ఉస్తాద్’ ఎలా కనిపెట్టాడు? అతని బారి నుంచి సీఎంని, దేశాన్ని ఎలా రక్షించుకున్నాడు? ఈ కథలో లీల (శ్రీలీల), శ్లోక (రాశీ ఖన్నా)ల పాత్రేంటి? వారితో ‘ఉస్తాద్’కి ఉన్న లింకేంటి? వంటి ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే మాత్రం థియేటర్స్‌లో ఉన్న ఈ సినిమా చూడాల్సిందే.
Also Read- Peddi Song: రెహమాన్ ఈజ్ బ్యాక్.. ‘రైరై రారా’ అడిక్షన్!
నటీనటుల పనితీరు
ఇది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా. మ్యాగ్జిమమ్ ప్రతి సీన్‌లో ఆయన కనిపించాలని ఫ్యాన్స్ కోరుకుంటారు. హరీష్‌కి ఆ విషయం బాగా తెలుసు కాబట్టి.. మ్యాగ్జిమమ్ అందుకు ప్రయత్నించాడు. స్టార్టింగ్‌లో కొంత సేపు పవన్ కళ్యాణ్ కనిపించడు కానీ, ఆ తర్వాత ప్రతి సీన్‌లో ఆయన కనిపిస్తూ, ఫ్యాన్స్‌కు ట్రీట్ ఇచ్చారు. మరీ ముఖ్యంగా వింటేజ్ పవన్ కళ్యాణ్‌ని చూసి ఫ్యాన్స్ ఆనందానికి అవధులు ఉండవు. ఆయనకు నచ్చిన అంశాలన్నీ ఇందులో ఉండటంతో పవన్ కళ్యాణ్ కూడా ఎక్కడా తగ్గలేదు.. తెరపైన చెలరేగిపోయాడని చెప్పొచ్చు. లీల పాత్రలో శ్రీలీలకు కాస్త ఎక్కువ స్పేస్ దక్కింది. శ్రీలీల కూడా తన నటనతో ఆకట్టుకుంది. రాశీ ఖన్నా పాత్రకు అంత ఇంపార్టెన్స్ లేదు కానీ, కనిపించినంత సేపు గ్లామర్ ట్రీట్ ఇచ్చేసింది. సీఎంగా కె.ఎస్. రవికుమార్ చాలా హుందాగా కనిపించారు. రావు రమేష్ పాత్రతో మంచి ట్విస్ట్ ఇచ్చారు. విలన్‌గా నల్ల నాగప్ప పాత్రలో పార్తీబన్, ఆయన కుమారులుగా చేసిన వారు మంచి ప్రభావం చూపించగలిగారు. గౌతమి పాత్రకు ఇంకాస్త స్కోప్ ఇచ్చుంటే బాగుండేది. ఎల్బీ శ్రీరామ్ పాత్రకు నిడివి చాలా తక్కువ ఉన్నా, ఇంపాక్ట్ కలిగించేలా ఉంది. లీల ఫ్రెండ్ పాత్ర పోషించిన నటికి మంచి పాత్ర పడింది. ప్రభాస్ శ్రీను, సత్యం రాజేష్, ప్రవీణ్ వంటి వారంతా తమదైన కామెడీ పండించే ప్రయత్నం చేశారు. మిగతా పాత్రలలో నటించిన వారంతా ఓకే.
Blockbuster response from USA Premieres and early shows 💥💥💥
Response dhaddarillipoyindi 🔥🔥#UstaadBhagatSingh NOW IN CINEMAS ❤🔥
POWER STAR @PawanKalyan @harish2you @sreeleela14 #RaashiiKhanna @thisisdsp @musicthaman @rparthiepan @DoP_Bose… pic.twitter.com/TT9pOimtzI
— Mythri Movie Makers (@MythriOfficial) March 19, 2026
Also Read- Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ఇంకా సినిమాలు చేస్తాడా?
సాంకేతిక నిపుణుల పనితీరు ఎలా ఉందంటే?
సాంకేతికంగా సినిమా చాలా ఉన్నతంగా ఉంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో పెట్టిన ప్రతి రూపాయి తెరపై కనిపిస్తుంది. ఆనంద్ సాయి సెట్స్ బాగా కుదిరాయి. ఎడిటింగ్ కూడా బాగా కుదిరింది. దేవి శ్రీ ప్రసాద్ ఇచ్చిన పాటలు, థమన్ నేపథ్య సంగీతం వావ్ అనే రేంజ్‌లో ఉన్నాయి. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ పరంగా థమన్ ప్లస్సు, మైనస్సు అని కూడా చెప్పాలి. పవన్ కళ్యాణ్‌పై ఉన్న అభిమానంతో థమన్ వాయిస్తూనే ఉన్నాడు. కానీ, ఒక డైలాగ్ తర్వాత కొంచెం గ్యాప్ వస్తే చాలు.. మోత మోగిపోతుంది. ఇది కాస్త ఇరిటేటింగ్‌గా అనిపిస్తుంది. ఫ్యాన్స్ వరకు ఓకే కానీ, మిగతా వారికి కాస్త తలనొప్పిగా అనిపిస్తుంది. సినిమాటోగ్రఫీతో పాటు ఇతర సాంకేతిక నిపుణులందరూ ప్రాణం పెట్టేశారు. ఇక దర్శకుడు హరీష్ శంకర్ అయితే ఫ్యాన్స్‌కు ఏమేం కావాలో అవి ఇస్తూనే కథను నడిపించిన తీరు ఆలరిస్తుంది. ముఖ్యంగా డైలాగ్స్ పడాల్సిన చోట పడ్డాయి. పొలిటికల్‌గా పవన్ కళ్యాణ్ ఏంటనే విషయాన్ని తెలియజేయడానికి కూడా హరీష్‌కు మంచి స్కోప్ లభించింది. అందుకే ఎక్కడా తగ్గలేదు. ఒక కమర్షియల్ సినిమాకు ఏమేం కావాలో అవన్నీ ఉండేలా హరీష్ శంకర్ ఈ సినిమాలో పొందుపరిచారు. ఫ్యాన్స్‌కు మాత్రం ఫుల్ మీల్స్ అని చెప్పుకోవచ్చు.
Also Read- Varalaxmi: తమిళ్ కాదు.. తెలుగు రాజకీయాల్లోకే రావచ్చేమో!
విశ్లేషణ (Ustaad Bhagat Singh Review)
‘గబ్బర్ సింగ్’ తరహాలోనే హరీష్ శంకర్ ఇందులో కూడా కుర్రాడి పాత్రతోనే పవన్ కళ్యాణ్‌కు ఇవ్వాల్సిన ఎలివేషన్, క్యారెక్టర్ ఇంపార్టెన్స్ తెలియజేశాడు. చిన్నప్పటి పాత్రతోనే పవన్ కళ్యాణ్ ప్రభావం ఎలా ఉండబోతుందనే క్లారిటీ ఇచ్చిన హరీష్.. స్టేషన్‌లో ఫైట్‌తో ఆయనని పరిచయం చేసిన తీరు మాత్రం ఫ్యాన్స్‌కు యమా కిక్ ఇస్తుంది. కాకపోతే కాస్త కథపై దృష్టి పెట్టి ఉంటే మాత్రం ఈ సినిమా వేరే రేంజ్‌లో ఉండేది. అలా అని, ఇందులో ఏం లేదని అనుకుంటే పొరబాటే. పవన్ కళ్యాణ్ ఎలివేషన్స్, లుక్, డైలాగ్స్ అన్నీ కూడా బాగా ఆకర్షిస్తాయి. కథగా చూస్తే మాత్రం రొటీన్‌గానే అనిపిస్తుంది కానీ, కొన్ని సీన్స్ మాత్రం బాగా అలరిస్తాయి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ నేచర్‌ని తెలిపేలా హరీష్ రాసిన కొన్ని సన్నివేశాలు బాగా పేలాయి. ముఖ్యంగా సెకండాప్‌లో వచ్చే ఓ సన్నివేశంలో పవన్ కళ్యాణ్ యాక్టింగ్ అందరితో కన్నీళ్లు తెప్పిస్తాయి. చాలా ఎమోషనల్‌గా, ప్రజంట్ జనరేషన్‌కు రిలేటెడ్‌గా ఆ సన్నివేశం ఈ సినిమాకు హైలెట్ అనే చెప్పాలి. నెట్ వర్క్ నెక్ట్స్ లెవల్‌లో ఉంటుందని పవన్ పదే పదే అంటుంటే ఏదో అనుకుంటారు కానీ, దానికి కూడా వివరణ ఇచ్చిన విధానం అందరికీ నచ్చేస్తుంది. కాకపోతే, అదే సీన్ రిపీటెడ్‌గా ఉండటం కాస్త ఇరికించినట్లుగా అనిపిస్తుంది. ప్రస్తుత జనరేషన్‌ను వేధిస్తున్న డిప్రెషన్, దూరమవుతున్న దేశభక్తి, తొలిచేస్తున్న సోషల్ మీడియా వంటి వాటన్నింటినీ ఇందులో హరీష్ చూపించిన విధానానికి హ్యాట్సాఫ్ చెప్పొచ్చు. ఓవరాల్‌గా అయితే, ఫ్యాన్స్‌కు కావాల్సిన మాస్ ఫీస్ట్ ఇస్తూనే.. హరీష్ అన్నింటినీ కవర్ చేశాడు. కథలో కొత్తదనం లేకపోవడం, హై రేంజ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్.. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమాకు నార్మల్ రిజల్ట్‌నే ఇచ్చే అవకాశం ఉంది. ‘ఓజీ’ మ్యాజిక్ మాత్రం రిపీట్ కాలేదనే చెప్పుకోవాలి.

