Samantha:టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత తాజాగా నటించిన చిత్రం మా ఇంటి బంగారం. ఈ సినిమాతో సరికొత్త రికార్డులను తిరగ రాయడమే కాకుండా ఇప్పటివరకు లేడీ హీరోయిన్స్ రికార్డులను తిరగరాసింది. డైరెక్టర్ నందిని రెడ్డి దర్శకత్వం వహించారు. ముఖ్యంగా ఇందులో సమంత యాక్షన్ సీన్స్ తో అదరగొట్టేశారు. ఈ సినిమా చూసిన అభిమానులు కూడా సమంత ఈజ్ బ్యాక్ అంటూ పలు రకాలుగా కామెంట్స్ చేస్తూ ఖుషి అవుతున్నారు. ఇందులో శ్రీముఖి, వెన్నెల కిషోర్ తదితర నటీనటులు కీలకమైన పాత్రలలో నటించారు.
ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ లాక్ చేసుకున్న మా ఇంటి బంగారం..
మా ఇంటి బంగారం సినిమాకి స్టోరీ అందించింది సమంత (Samantha)భర్త, డైరెక్టర్ రాజ్ నిడిమోరు. అలాగే ఈ సినిమాని కూడా తన సొంత బ్యానర్ పైన నిర్మించింది సమంత. ఈ సినిమా ఇప్పటివరకు రూ .100 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. ఎప్పుడెప్పుడు ఈ సినిమా ఓటీటీ లోకి వస్తుందా అని ఎదురు చూస్తున్నా అభిమానులకు తాజాగా గుడ్ న్యూస్ తెలియజేసింది ప్రముఖ ఓటీటి ప్లాట్ ఫామ్ సంస్థ జియో హాట్ స్టార్. జులై 17వ తేదీ నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కి సిద్ధమయ్యింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఒక్కొక్కడిని కొడతాను చూడు.మ ప్రేమతో అబ్బా అనే డైలాగుతో మేకర్స్ తెలియజేశారు.
ALSO READ:OTT:ఓటీటీలోకి వస్తున్న ‘వంద దేవుళ్లు’..విజయ్ ఆంటోనీ ఎమోషనల్ డ్రామా స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
నెల తిరగకుండానే ఓటీటీలోకి..
జూన్ 19వ తేదీన విడుదలైన ఈ చిత్రానికి థియేటర్లలో భారీ రెస్పాన్స్ లభించింది. సమంత కెరియర్ లోని ఒక వైవిద్యమైన పాత్రలో నటించింది. చాలా కాలంగా సినిమాలకు గ్యాప్ తీసుకున్న సమంత.. మా ఇంటి బంగారం చిత్రంతో తన స్టామినా నిరూపించుకుంది. నాగచైతన్యతో విడాకులు తర్వాత సమంత నటించిన సినిమాలేవి కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. కానీ రాజ్ నిడిమోరు తో వివాహం అనంతరం సమంత రీఎంట్రీ ఇచ్చిన మా ఇంటి బంగారం సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది.
ALSO READ:Tejaswini:సాయి పల్లవి హిట్ పాటకు బాలయ్య చిన్న కూతురు అదిరే డ్యాన్స్.. వీడియో వైరల్!
ప్రెగ్నెన్సీని ఎంజాయ్ చేస్తున్న సమంత..
ప్రస్తుతం సమంత సినిమా సక్సెస్ లో భాగంగా హ్యాపీగా ఉండడమే కాకుండా ప్రస్తుతం తాను ప్రెగ్నెంట్ అనే విషయాన్ని కూడా అభిమానులకు తెలియజేసి మరింత ఆనందాన్ని కలిగించింది. దీంతో కొద్ది రోజులు మళ్లీ గ్యాప్ తీసుకొని వెండితెర పైన మళ్ళీ కనిపిస్తానంటూ ఇటీవలే తెలియజేసింది. ఏది ఏమైనప్పటికీ సమంత కు ఈ ఏడాది మాత్రం బాగా కలిసి వచ్చిందని చెప్పవచ్చు. ప్రస్తుతం ఈ విషయం మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
July 17th
Okokkodni kodathamu chudu… Prematho abbaaa ❤️🔥#MaaIntiBangaaram streaming from July 17th on JioHotstar! 💫 #MaaIntiBangaaramOnJioHotstar@Samanthaprabhu2 @TralalaPictures #RajNidimoru #NandiniReddy @himankd @gulshandevaiah @diganthmanchale @gautamitads… pic.twitter.com/0pgDLow1n4— JioHotstar Telugu (@JioHotstarTel_) July 12, 2026




