Pragya jaiswal;బాలయ్య హీరోయిన్ల తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న ప్రగ్యా జైస్వాల్ తాజాగా మరో ట్రెండీ ఔట్ఫిట్ తో ఆడియన్స్ ముందుకు వచ్చింది.
క్రిష్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా నటించిన కంచె సినిమా ద్వారా అద్భుతమైన నటనను కనబరిచి అందరి దృష్టిని ఆకట్టుకుంది ప్రగ్యా జైస్వాల్.
ఈ సినిమా ద్వారా ఉత్తమ నటి విభాగంలో గద్దర్ అవార్డును కూడా సొంతం చేసుకుంది ఈ ముద్దుగుమ్మ. ఇకపోతే బాలకృష్ణ హీరోగా నటించిన అఖండ సినిమాలో కలెక్టర్ పాత్ర పోషించి అందరి దృష్టిని ఆకట్టుకుంది.
ఇకపోతే ఈ సినిమా మంచి విజయం అందించింది కానీ ప్రగ్యాకి అనుకున్న స్థాయిలో అవకాశాలు లభించడం లేదు.
ప్రస్తుతం బాలీవుడ్ లో అవకాశాలు అందుకునే దిశగా అడుగులు వేస్తున్న ఈమె మరొకవైపు అభిమానులను ఆకట్టుకోవడానికి నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది.
అందులో భాగంగానే తాజాగా థైస్ కనిపించేలా పొట్టి నిక్కరు ధరించి స్లీవ్ లెస్ టాప్ తో అందాలు ఆరబోస్తూ నెటిజన్స్ ను రెచ్చగొట్టే ప్రయత్నం చేసింది.
హాట్ అందాలను చూపిస్తూ ప్రజ్ఞా జైస్వాల్ తాజాగా షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి.