OTT:లో క్రైమ్ ధ్రిల్లర్ కథలకు ప్రేక్షకుల నుంచి ఎప్పుడు కూడా మంచి ఆదరణే ఉంటుంది. చివరి వరకు ఉత్కంఠను కొనసాగిస్తూ ఊహించిన ట్విస్టులతో సాగే వెబ్ సిరీస్లు ఎక్కువ మందిని ఆకట్టుకుంటూ వస్తున్నాయి. అలాంటి థ్రిల్లర్ ని ఇష్టపడే వాళ్ళకి “ఇరు ధురువం” ( Iru Dhuruvam )మంచి ఎంపిక అని చెప్పవచ్చు. మొదటి ఎపిసోడ్ నుంచి ఆసక్తిని పెంచే ఈ తమిళ్ వెబ్ సిరీస్ ప్రతి భాగంలో కొత్త మలుపులతో ప్రేక్షకులను కథలో లీనమయ్యేలా చేస్తుంది.
పోలీస్ అధికారికి ఎదురైన అతిపెద్ద సవాలు:
ఈ కథలో నిజాయితీగల పోలీస్ అధికారి విక్టర్ సెల్లదురై ప్రధాన పాత్ర. అతని వ్యక్తిగత జీవితంలో అనుకొని సంఘటనలు చోటు చేసుకుంటూ వస్తాయి. నగరంలో వరుస హత్యలు కలకలం రేపుతాయి. ప్రతి హత్య తర్వాత నిందితుడు ఒక రహస్య క్లూ ని వదిలిపెట్టడంతో కేసు మరింత క్లిష్టంగా మారుతుంది. అన్ని ఆధారాలు ఒకే వ్యక్తి వైపు చూపడంతో పోలీసులు ఇది సైకో పని అని భావిస్తారు. ఆ తర్వాత విక్టర్ ప్రారంభించే దర్యాప్తు కథను మరింత ఉత్కంఠ భరితంగా మారుస్తుంది.
also read:Pokiri: రీ రిలీజ్ కాబోతున్న పోకిరి మూవీ.. ఎప్పుడంటే?
ప్రతి ఎపిసోడ్లో సస్పెన్స్ ట్విస్ట్:
విచారణలో ప్రతి అడుగులోను విక్టర్ ను కొత్త సవాళ్లు ఎదురవుతాయి. కిల్లర్ పోలీసుల కంటే ఒక అడుగు ముందు ఆలోచిస్తూ.. వారిని తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తుంటాడు. అసలు హంతకుడు ఎవరు..? అతను ఈ హత్యలకి పాల్పడడానికి కారణం ఏంటి..? విక్టర్ భార్య అదృశ్యం వెనక ఉన్న నిజం ఏంటి..? చివరికి పోలీసులు ఆ కేసును ఎలా చేదించారు..? అనే ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలి అంటే ఈ సిరీస్ ను పూర్తిగా చూడాల్సిందే.
also read:Fauzi:Most Wanted Since 1932′.. ప్రభాస్ ‘ఫౌజీ’ పోస్టర్‌లో దాగిన అసలు సీక్రెట్ ఇదేనా?
ఎక్కడ చూడొచ్చు:
దర్శకుడు ఎం. కుమరన్ రూపొందించిన ఈ వెబ్ సిరీస్‌ను అప్లాజ్ ఎంటర్‌టైన్‌మెంట్, ఎ సైన్ ఆఫ్ లైఫ్ ప్రొడక్షన్స్ నిర్మించాయి. నందా దురైరాజ్, ప్రసన్న, అబ్దుల్, సెబాస్టియన్ ఆంటోనీ, అభిరామి వెంకటాచలం తదితరులు కీలక పాత్రలు పోషించారు. మొత్తం తొమ్మిది ఎపిసోడ్లతో సాగే ఈ సిరీస్ ఎక్కడా బోర్ కొట్టకుండా వేగంగా సాగుతుంది. ‘ఇరు ధురువం’ ప్రస్తుతం Sony LIV ఓటీటీ (OTT)ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. 2019లో విడుదలైన ఈ సిరీస్‌కు తర్వాత రెండో సీజన్ కూడా వచ్చింది. క్రైమ్ థ్రిల్లర్‌లను ఇష్టపడే వారికి ఇది తప్పక చూడాల్సిన వెబ్ సిరీస్‌గా నిలుస్తోంది.




