Aishwarya Rajesh:తమిళ్ ఇండస్ట్రీలో హీరోయిన్గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న ఐశ్వర్య రాజేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తనకి పాత్రతో సంబంధం లేకుండా ఎలాంటి పాత్రలో అయినా సరే నటిస్తోంది. హీరోయిన్గా దాదాపుగా 35 సినిమాలలో నటించింది. తెలుగులో నటించిన ఆరవ చిత్రం ఓ సుకుమారి అనే చిత్రం.. రేపు (జూలై 17) ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. ఈ సందర్భంగా ఆమె ప్రమోషన్స్ లో భాగంగా పలు రకాల ఇంటర్వ్యూలలో పాల్గొంది. ఈ క్రమంలోనే తాను హీరోయిన్గా ఎదుర్కొన్న ఇబ్బందులు, తన జీవితంలో జరిగిన విషయాలను పంచుకుంది.
ఆ భయం వల్లే ఎక్కువ సినిమాలు చేశాను..
ముఖ్యంగా తాను హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తున్న మొదట్లో హీరోయిన్ లైఫ్ టైం చాలా తక్కువగా ఉంటుందని, కేవలం నాలుగు లేదా మూడేళ్లు మాత్రమే ఉంటుందని చాలా మంది భయపెట్టారట. ఆ భయం వల్లే తాను అతి తక్కువ సమయంలో ఎక్కువ సినిమాలు చేయగలిగానని, తన కెరియర్లో 35 తమిళ చిత్రాలు చేశానని , తెలుగులో రేపు ఆరవ చిత్రం విడుదల కాబోతోంది అంటూ తెలియజేసింది. అలాగే మలయాళంలో కూడా ఐదు సినిమాలు చేసినట్లు తెలియజేసింది ఐశ్వర్య రాజేష్(Aishwarya Rajesh:). ముఖ్యంగా తనని భయపెట్టడం వల్లే తనకు వచ్చిన అవకాశాలలో చేశానని తెలియజేసింది.
also read:Rasha Thadani: తేనె కళ్ళతో కసిగా కవ్విస్తున్న మంగ.. లేటెస్ట్ ఫోటోలు వైరల్.
అలాంటి పాత్రలో నటించాలని ఉంది..
తనకు పాత్ర నచ్చితే ఎలాంటి పాత్రలో అయినా చేయడానికి ఇష్టపడతానని తెలియజేసింది. అయితే తనకు ఇప్పటివరకు ఎక్కువగా అమాయకంగా ఉండే పాత్రలు, దురుసుగా ఉన్న పాత్రలు మాత్రమే వచ్చాయని కానీ నెగటివ్ షేడ్స్ కలిగి ఉన్న పాత్రలు చేయాలని ఉందంటూ తెలియజేసింది ఐశ్వర్య రాజేష్. ఇసకపట్నం వెబ్ సిరీస్ లో కొంతమేరకు టచ్ అయి వెళ్లిపోయినట్లు కనిపిస్తుంది కానీ పూర్తిగా తన పాత్ర నెగిటివ్ షేడ్ కాదని తనకు రమ్యకృష్ణ చేసిన నీలాంబరి తరహాలోని పాత్ర చేయాలని ఉందంటూ తెలియజేసింది.
also read:Pragya jaiswal: పొట్టి నిక్కర్లో థైస్ అందాలతో సెగలు పుట్టిస్తున్న బాలయ్య బ్యూటీ!
నాకు కూడా కష్టాలు తప్పలేదు..
అంతేకాకుండా ఇటీవలే విడుదలై మంచి విజయాన్ని అందుకున్న అబ్సెషన్ చిత్రంలోని సైకో పాత్రలు చేయాలని ఉందంటూ తెలియజేసింది. తెలుగు అమ్మాయి కావడం వల్ల తనకు ఏ యాస అయినా మాట్లాడగలనని , అది ఇబ్బందిగా అనిపించదంటూ కాదు చెప్పుకొచ్చింది.తాను అన్ని ప్రాంతాల భాషలలో మాట్లాడగలనని , తెలుగు, తమిళ భాషలలో నటించే అవకాశాలు రావడం తనకు చాలా అదృష్టమంటూ తెలియజేసింది. ఐశ్వర్య రాజేష్ ఎవరో కాదు దివంగత నటుడు రాజేష్ కుమార్తె. బడ ఇండస్ట్రీ ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ నుంచి ఎంట్రీ ఇచ్చినప్పటికీ ఇండస్ట్రీలో అవకాశాల కోసం చాలా కష్టపడ్డానని ఎన్నోసార్లు తెలియజేసింది. మరి ఓ సుకుమారి సినిమాతో ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి మరి.




