Saturday, July 18, 2026
HomeLATESTThe Odyssey:ది ఒడిస్సీ మూవీ రివ్యూ.. యాక్షన్ డ్రామా మూవీకి హైలెట్స్ అవే..!

The Odyssey:ది ఒడిస్సీ మూవీ రివ్యూ.. యాక్షన్ డ్రామా మూవీకి హైలెట్స్ అవే..!

The Odyssey: క్రిస్టోఫర్ నోలన్ దర్శకత్వంలో తెరకెక్కిన విజువల్ వండర్ ది ఒడిస్సీ సినిమా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను అలరిస్తోంది.

on
- Advertisement -banner Ad

నటీనటులు:

The Odyssey:మ్యాట్ డామన్, టామ్ హాలండ్, అన్నే హత్వే, రాబర్ట్ , జెండయా తదితరులు ఈచిత్రంలో నటించారు. డైరెక్టర్ క్రిస్టోఫర్ నోలన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. డైరెక్టర్ క్రిష్టఫర్ నోలన్ దర్శకత్వం నుంచి సినిమా వస్తుందంటే చాలు ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా కోసం చాలామంది ప్రేక్షకులు ఎదురు చూస్తుంటారు. హూమర్ రాసిన ఒక ప్రసిద్ధి గ్రీకు మైథాలజీ ఆధారంగా నోలన్ “ది ఒడిస్సీ”(The Odyssey) చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ రోజున భారీ అంచనాల మధ్య ఈ సినిమా థియేటర్లోకి వచ్చింది. మరి ఏవిధంగా ప్రేక్షకులను మెప్పించిందో చూద్దాం.

ALSO READ:SreeMukhi: కాటుక కళ్ళతో మాయ చేస్తూ రెడ్ అవుట్ ఫిట్ లో హీట్ పుట్టిస్తున్న శ్రీముఖి!

- Advertisement -
Advertisement

స్టోరీ:

ట్రోజన్ యుద్ధంలో గ్రీకులు ఎట్టకేలకు విజయం అందుకుంటారు. భారీ చెక్క గుర్రం సహాయంతో శత్రువుల కోటలోకి తెలివిగా చొరబడి ఒడిస్సీయస్(మ్యాట్ డామన్) వేసిన మాస్టర్ ప్లాన్ వల్లే గెలుస్తారు. అయితే యుద్ధం ముగిశాక తమ సొంత రాజ్యం ఇథాకాకు తిరుగు ప్రయాణిస్తున్నప్పుడు ఒడిస్సీయస్ కి అసలైన కష్టాలు ఎదురవుతాయి. అతడి ప్రయాణాన్ని అడ్డుకునేందుకు దేవుళ్ళు పన్నే పద్మ వ్యూహాలు ఒక ఎత్తు అయితే.. తన సొంత రాజ్యంలో ఎదురయ్యే అతిపెద్ద ముప్పు మరొక ఎత్తు . అన్ని అద్దంకులను దాటుకొని మరీ ఒడిస్సీయస్ ఎలా ఎదుర్కొంటాడు? తన కుటుంబాన్ని , రాజ్యాన్ని ఎలా కాపాడుకుంటారు? అనేది తెలియాలి అంటే వెండితెరపై చూడాల్సిందే.

ALSO READ:Niharika NM: టాప్ అందాలతో రచ్చ లేపుతున్న నిహారిక!

- Advertisement -
Advertisement

బలాలు:

కథ స్క్రీన్ ప్లే అద్భుతంగా ఉంది.

నటీనటుల పర్ఫామెన్స్

- Advertisement -
Advertisement

దర్శకత్వం, సాంకేతిక బృందం పనితీరు

సన్నివేశాలలో సహజత్వంగా కనిపించడం.

మైనస్ పాయింట్:

ద్వితీయార్థంలో కొన్ని సీన్స్

నటీనటుల యాక్టింగ్:

ఒడిస్సీయస్ పాత్రలో మ్యాట్ డామన్ అద్భుతంగా నటించారు. ఎక్కడ ఎక్కువ లేకుండా క్లిష్టమైన పాత్రకు అవసరమైన బాగోద్వేగాలను అద్భుతంగా పండించారు. పెనెలోప్ గా అన్నే హత్వే, టెలిమాకస్ గా టామ్ హాలెండ్ తమ పాత్రలకు న్యాయం చేశారు. నటీనటులలో భారతీయ నటుడు హిమేష్ పటేల్ అద్భుతంగా నటించారు. మంత్రగత్తే సిర్సి పాత్రలో సమంత మోర్టన్ ఆకట్టుకుంది.

సాంకేతిక పరంగా కూడా ఈ సినిమా మరో సరికొత్త ట్రెండ్ సెట్టర్గా అవుతుంది. ప్రస్తుతం ఏఐ, విఎఫ్ఎక్స్ లాంటి తరుణంలో ఆధునిక సినిమా ప్రపంచంలో వాస్తవానికి దగ్గరగా ఉండేటువంటి అంశాలను చూపించిన తీరు అద్భుతంగా ఆకట్టుకుంటోంది. ప్రేక్షకుడిని కథలో లీనం చేయడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యారు. డైరెక్టర్ క్రిస్టోఫర్ నోలన్ వాస్తవ ప్రపంచానికి దగ్గరగా తెరకెక్కించారు. ఆయన విజన్ టేకింగ్ మరోసారి అద్భుతంగా ఆకట్టుకుంది.

తీర్పు: బిగ్ స్క్రీన్ పై తప్పక చూడాల్సిన ఎపిక్ బ్లాక్ బాస్టర్ మూవీ.

రేటింగ్: 3.5/5

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you