Saturday, July 18, 2026
HomeLATESTOh sukumari:ఓ సుకుమారి మూవీ రివ్యూ.. ప్రేక్షకులను మెప్పించిందా?

Oh sukumari:ఓ సుకుమారి మూవీ రివ్యూ.. ప్రేక్షకులను మెప్పించిందా?

Oh Sukumari: ఐశ్వర్య రాజేష్ తిరువీరు జంటగా వచ్చిన ఓ సుకుమారి సినిమా జూలై 17వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

on
- Advertisement -banner Ad

నటీనటులు:

Oh sukumari:హీరోయిన్ ఐశ్వర్య రాజేష్, హీరో తిరువీర్, ఆమని, ఆనంద్ తదితరులు నటించారు. డైరెక్టర్ భరత్ దర్శన్ ఈ సినిమాని తెరకెక్కించారు. కామెడీ ఎంటర్టైన్మెంట్ గా నేడు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకి వచ్చింది. ఏ విధంగా ఆకట్టుకుందో ఇప్పుడు ఒకసారి చూద్దాం.

ఎప్పుడు కూడా విభిన్నమైన కథలను ఎంచుకొనే హీరో తిరువీర్, టాలెంటెడ్ హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ కాంబినేషన్లో వచ్చిన చిత్రం ఓ సుకుమారి(Oh sukumari). ఈ సినిమాని డైరెక్టర్ భరత్ దర్శన్ రొమాంటిక్ కామెడీ డ్రామా ఎంటర్టైన్మెంట్గా తెరకెక్కించారు. ట్రైలర్ తో బాగా ఆసక్తి పెంచిన ఈ సినిమా ఇప్పుడు ఎలా ఉందో చూద్దాం.

- Advertisement -
Advertisement

స్టోరీ:

సర్పంచ్ కావాలనే కలతో నరాల యాదగిరి (తిరువీర్) కి ఒక షరతు మీద తన తాత రాసినటువంటి లేఖలో రూ. 80 కోట్ల ఆస్తి దక్కుతుందని తెలుస్తుంది. ఆ ఆస్తి కోసమే యాదగిరి పెళ్లి చేసుకోవాలని పెళ్లి చూపులలో అనుకోకుండా దామిని (ఐశ్వర్య రాజేష్) ను చూసి ప్రేమలో పడతారు. అయితే దామినిని చూసి భయపడే ఊరి ప్రజలు కూడా ఈ వివాహాన్ని ఎలాగైనా జరిపించాలని ఆరాటపడతారు. దీంతో యాదగిరికి నిజం చెప్పకుండా వివాహం చేస్తారు. ఫస్ట్ నైట్ రోజు అతనికి ఒక ఊహించని షాక్ తగులుతుంది. అసలు దామిని సమస్య ఏంటి ? ఆ ఊరి వాళ్లంతా ఆమెను ఎందుకు చూసి భయపడతారు? చివరికి యాదగిరికి తాత ఆస్తి దక్కుతుందా? లేదా? అనేది ఈ సినిమా స్టోరీ.

ALSO READ:The Odyssey:ది ఒడిస్సీ మూవీ రివ్యూ.. యాక్షన్ డ్రామా మూవీకి హైలెట్స్ అవే..!

- Advertisement -
Advertisement

ప్లస్ పాయింట్స్:

విరామానికి ముందు సీన్స్
ఐశ్వర్య రాజేష్ యాక్టింగ్, తిరువీర్ యాక్టింగ్

మైనస్ పాయింట్స్:

ఆకట్టుకోలేని కామెడీ సీన్స్,
పండలేని ఎమోషనల్ సీన్స్
సహజత్వం లేని కథ

- Advertisement -
Advertisement

ALSO READ:SreeMukhi: కాటుక కళ్ళతో మాయ చేస్తూ రెడ్ అవుట్ ఫిట్ లో హీట్ పుట్టిస్తున్న శ్రీముఖి!

ఎవరెవరు ఎలా నటించారంటే:

యాదగిరి పాత్రలో తిరువీర్ అద్భుతంగా అలరించారు. అమాయకత్వంతో కూడిన ఈ పాత్ర సహజమైన నటన అన్నట్టుగా నటించారు. ఎన్నో సన్నివేశాలకు తిరువీర్ నటన బలం చేకూర్చింది. కథ ఎంపిక విషయంలో మరింత జాగ్రత్త అవసరం.

హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ కూడా ఈ సినిమా చేయడం వెనుక బలమైన కారణమేంటో ఈ సినిమాలో ఆమె పాత్రను చూస్తే తెలుస్తుంది . ఆమె పాత్ర చుట్టూనే ఈ సినిమా కథ తిరుగుతుంది. ఐశ్వర్య రాజేష్ కూడా తన పాత్రలో ఒదిగిపోయి నటించింది ఇందులో కొన్ని సీన్స్ హీరోకి దీటుగానే కనిపిస్తాయి.

అలాగే ఝాన్సీ, మురళీధర్ గౌడ్, ఆమని, శ్రీనివాస్ గవిరెడ్డి తదితర నటీనటులు పాత్రలు కూడా ఆకట్టుకున్నాయి. డైరెక్టర్ భరత్ దర్శన్ కాన్సెప్ట్ బాగున్నప్పటికీ కదా పాత్రలను మరింత బలంగా రాసుకోవాల్సింది అనే విషయం సినిమాలకు చాలా స్పష్టంగా కనిపిస్తోంది.

 

రేటింగ్ 2.5/5

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you