Wednesday, August 26, 2026
HomeLATESTBigg Boss :విజయవాడ నుంచి బిగ్‌బాస్‌కి.. రోహిత్ నాయుడు గురించి ఈ విషయాలు తెలుసా?

Bigg Boss :విజయవాడ నుంచి బిగ్‌బాస్‌కి.. రోహిత్ నాయుడు గురించి ఈ విషయాలు తెలుసా?

Bigg Boss :బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10లో కామనర్‌గా ఎంట్రీ కోసం జరుగుతున్న అగ్నిపరీక్ష 2లో విజయవాడకు చెందిన రోహిత్ నాయుడు పట్నం టఫ్ ఫైట్ ఇస్తున్నారు.

on
- Advertisement -banner Ad

Bigg Boss :బిగ్‌బాస్ 10 తెలుగు ప్రధాన షోకి కామనర్స్ ఎంట్రీ ఇవ్వడానికి నిర్వహిస్తున్న షో ‘అగ్నిపరీక్ష’. ఇది ఎంత కఠినంగా ఉంది. ఎంత హాట్ టాపిక్‌గా మీడియాలో ట్రెండ్ అవుతుంది అన్నది ఫాలో అయ్యే ప్రతి ఒక్కరికీ తెలిసే ఉంటుంది. మరీ ముఖ్యంగా ఈ అగ్నిపరీక్ష సీజన్ 2లో ఇచ్చే టాస్కులు చాలా చాలా కఠినంగా ఉన్నాయి అంటూ, ఇది మనుషులను బాధపెట్టే విధంగా ఉన్నాయి అంటూ చాలామంది సోషల్ మీడియా వేదికగా రియాక్ట్ అవుతున్నారు. కఠినమైన టాస్కులతో కామనర్స్‌ను పరీక్షిస్తున్నారు అంటూ మరికొంతమంది కామెంట్స్ చేస్తున్నారు.

విజయవాడకు చెందిన రోహిత్ నాయుడు:

విజయవాడకు చెందిన రోహిత్ నాయుడు కూడా ఒకరుగా నిలవడం విజయవాడ వాసులకు ఆనందాన్నిస్తుంది. ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా సరే రోహిత్ నాయుడుకు సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఏం చేస్తున్నారు? అసలు రోహిత్ నాయుడు ఎవరు? ఏం చేస్తూ ఉంటాడు? ఏం చదువుకున్నాడు? అగ్నిపరీక్షలోకి ఎలా వచ్చాడు? అనే విషయాలను బాగా సెర్చ్ చేస్తున్నారు. రోహిత్ నాయుడు విజయవాడకు చెందిన వ్యక్తి. ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చినవాడు. డిజిటల్ కంటెంట్ క్రియేటర్‌గా, ఎంతో మంచి ఇన్‌ఫ్లుయెన్సర్‌గా పేరు సంపాదించుకున్నాడు. ‘నమ్మకానికి, నిజాయితీకి మరో మారుపేరు’ అంటూ ఒక ట్యాగ్‌లైన్ కూడా ఉంది.

- Advertisement -
Advertisement

also read:Toxic Review:టాక్సిక్ రివ్యూ అండ్ రేటింగ్ : యశ్ ఊచకోత.. థియేటర్లలో మాస్ జాతర..కానీ?

మోడలింగ్, యాక్టింగ్‌పై ఆసక్తి:

మోడలింగ్ అంటే పిచ్చి, యాక్టింగ్ పట్ల ఉన్న ఇంట్రెస్ట్‌తో అగ్నిపరీక్షలోకి వచ్చాడు. సోషల్ మీడియాలో రోహిత్‌కు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువే. రీల్స్, షార్ట్స్ ఎక్కువగా చేస్తూ ఉంటాడు. లైఫ్‌స్టైల్ కంటెంట్‌ను ఎక్కువగా షేర్ చేస్తూ ఉంటాడు. బిగ్‌బాస్ అగ్నిపరీక్ష ఎంట్రీతో ఇతడికి ఇంకా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది.

- Advertisement -
Advertisement

also read:Ritika Nayak : లేటెస్ట్ సోయగాలతో కుర్రకారు హృదయాలు దోచుకుంటున్న రితికా నాయక్!

టాస్కుల్లో రోహిత్ ప్రతిభ:

అగ్నిపరీక్షలో బిందు మాధవి, నవదీప్ పెట్టిన టాస్క్‌లను రోహిత్ అవలీలగా ఫినిష్ చేసేస్తున్నాడు. అతనికి సపోర్ట్ చేస్తూ ఓట్లు వేస్తున్నారు. అగ్నిపరీక్ష ఎపిసోడ్‌లో బిందు మాధవి ఒక టాస్క్ పేరుతో ఎంత రెచ్చగొట్టినా రోహిత్ మాత్రం తెలివిగా ఆ టాస్క్‌ను పూర్తి చేసి శభాష్ అనిపించుకున్నాడు. సోషల్ మీడియాలో ఆయన పేరు మారుమోగిపోయింది. రోహిత్ మరీ సాఫ్ట్‌గా ఉంటున్నాడు, గొడవలకు లేదా తన అభిప్రాయం చెప్పడానికి స్టాండ్ తీసుకోవడం లేదు అంటూ బిందు మాధవి చెప్పింది. అప్పుడే నవదీప్ రెడ్డి ఇచ్చేస్తాడు. అయితే అభిజిత్ మాత్రం ప్రతిదానికి రియాక్ట్ అవ్వాల్సిన పనిలేదు అంటూ, కూల్‌గా ఉంటేనే కొన్ని కొన్ని సార్లు ముందుకు వెళ్లగలమంటూ గ్రీన్ కార్డు ఇచ్చి అతన్ని హోల్డ్‌లో పెట్టారు.

- Advertisement -
Advertisement

రోహిత్ బిగ్‌బాస్‌లోకి వెళ్తాడా?:

బిగ్‌బాస్(Bigg Boss) అగ్నిపరీక్షలో టాస్కులు పూర్తి చేసిన తర్వాత కొందరిని హోల్డ్‌లో ఉంచారు. అలా హోల్డ్‌లో ఉంచిన కామనర్ కంటెస్టెంట్లలో రోహిత్ కూడా ఒకడిగా ఉన్నాడు. ఇప్పుడు ఆడియన్స్ ఓటింగ్ ద్వారా అతడు బిగ్‌బాస్‌లోకి వెళ్తాడా..? లేదా బిగ్‌బాస్ మరేదైనా ట్విస్ట్ పెడతాడా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలిపోయింది.

రోహిత్ వ్యక్తిగత జీవితం:

ఇక రోహిత్ పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే.. చిన్నప్పుడే వాళ్ల నాన్నగారు చనిపోయారు. జీవితం కష్టాల్లో మునిగిపోయింది. ఎన్నో కష్టాలు పడి ఇంటి బాధ్యతలను తీసుకున్నాడు. ఎన్నెన్నో సవాళ్లను ఎదుర్కొన్నారు.వాళ్ల అమ్మ ఎప్పుడూ ఒక పాఠం చెప్తూ వచ్చేదట. ఏం జరిగినా సరే నిన్ను నువ్వు ఎప్పుడూ వదులుకోవద్దు, బాధపడకు, బలంగా ముందుకు వెళ్లు, దృఢంగా నిలబడు. అదే నీకు సక్సెస్ ఇస్తుంది అని చెప్పేదట. ఆ మాటలను ప్రతిరోజూ గుర్తు చేసుకుంటారట. ‘ఈరోజు నేను నేర్చుకున్న ప్రతి పాఠాన్ని, ప్రతి త్యాగాన్ని గర్వంగా మోస్తున్నాను అంటే మా అమ్మే కారణం’ అంటూ చెప్పుకొచ్చాడు.ఇప్పుడు రోహిత్ బిగ్‌బాస్‌లోకి వెళ్తాడా..? లేదా..? అంటూ సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతుంది.

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you