Wednesday, August 26, 2026
HomeLATESTSobhita Dhulipala:"150 రోజులు చైతూకి దూరంగా ఉన్నా"..పెళ్లి పై శోభిత సెన్సేషనల్ కామెంట్స్..!

Sobhita Dhulipala:”150 రోజులు చైతూకి దూరంగా ఉన్నా”..పెళ్లి పై శోభిత సెన్సేషనల్ కామెంట్స్..!

Sobhita Dhulipala:అక్కినేని నాగచైతన్యతో పెళ్లి తర్వాత శోభిత ధూళిపాళ చేసిన ఆసక్తికర వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

on
- Advertisement -banner Ad

Sobhita Dhulipala:హీరోయిన్ శోభిత ధూళిపాళ.. కాదుకాదు.. అక్కినేని ఇంటికి కోడలు శోభిత ధూళిపాళ. ఇప్పుడు ఇదేవిధంగా శోభిత ధూళిపాళను గుర్తు చేసుకుంటున్నారు జనాలు. ఒకప్పుడు హీరోయిన్‌గా ఉన్నా.. ఇప్పుడు మాత్రం ఆమెను అక్కినేని ఇంటి కోడలుగానే గౌరవిస్తూ గుర్తుచేసుకుంటున్నారు. అది శోభిత ధూళిపాళకు చాలా బాగా నచ్చేస్తుంది. నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకున్న శోభిత ధూళిపాళ.. ఒకపక్క సినిమా లైఫ్, మరొక పక్క తన పర్సనల్ లైఫ్‌ను చాలా హ్యాపీగా, బ్యాలెన్స్‌డ్‌గా ముందుకు తీసుకెళ్తుంది. ఈ విషయంలో ఆమెను చాలా మంది హీరోయిన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు.

also read:Bigg Boss :విజయవాడ నుంచి బిగ్‌బాస్‌కి.. రోహిత్ నాయుడు గురించి ఈ విషయాలు తెలుసా?

- Advertisement -
Advertisement

పర్సనల్, ప్రొఫెషనల్ లైఫ్ బ్యాలెన్స్‌పై..:

అయితే, రీసెంట్‌గా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె తన పర్సనల్ లైఫ్, అదేవిధంగా ప్రొఫెషనల్ లైఫ్‌ను ఎలా బ్యాలెన్స్ చేస్తుంది అన్న విషయాల గురించి మాట్లాడారు. అవి కాస్త ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్నాయి.

శోభిత ధూళిపాళ(Sobhita Dhulipala) మాట్లాడుతూ.. “మొదట్లో పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్‌ను బ్యాలెన్స్ చేయలేకపోయాను. చాలా చాలా కష్టమనిపించింది. ఇప్పుడు ఇప్పుడే దాన్ని బ్యాలెన్స్ చేయడం అలవాటు చేసుకుంటున్నాను. పెళ్లి తర్వాత మేమిద్దరం కూడా మా వర్క్స్‌లో బాగా బిజీగా ఉండిపోయాము. పెళ్లయిన మొదటి ఏడాదే మేమిద్దరం కెరీర్ పరంగా చాలా బిజీగా గడిపేశాము.

- Advertisement -
Advertisement

also read:Toxic Review:టాక్సిక్ రివ్యూ అండ్ రేటింగ్ : యశ్ ఊచకోత.. థియేటర్లలో మాస్ జాతర..కానీ?

ఎలా అంటే.. దాదాపు 150 రోజులకు పైగా దూరంగా ఉన్నాము. నేనేమో షూటింగ్ కోసం తమిళనాడుకు వెళ్లేదాన్ని. తనేమో వేరే షూటింగ్ కోసం వేరే దగ్గర ఉండేవారు. ఆ సమయంలో నెలకొకసారి మాత్రమే మేము కలిసి మాట్లాడుకునేవాళ్లం. ఇద్దరం ప్రొఫెషనల్ లైఫ్‌ను బ్యాలెన్స్ చేయడం చాలా చాలా టఫ్ అనిపించింది. ఇప్పుడు ఆ కొత్త జీవితానికి అలవాటు పడటం.. మా బంధాన్ని ఏది బలంగా ఉంచుతుందో దానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తాము. లేనిపోని విషయాల గురించి ఆలోచించము” అంటూ చెప్పుకొచ్చారు.

- Advertisement -
Advertisement

నా పెళ్లి సంప్రదాయ పద్ధతిలోనే జరగాలి..:

అదేవిధంగా తన పెళ్లి కలల గురించి చెబుతూ.. “నా పెళ్లి పూర్తిగా సంప్రదాయ పద్ధతిలోనే జరగాలి” అంటూ ఎప్పటినుంచో అనుకునేదాన్ని. నాకు సంప్రదాయం అంటే చాలా చాలా ఇష్టం, గౌరవం. నా సొంత రాష్ట్రానికి చెందిన వ్యక్తిని వివాహం చేసుకుంటానని ఎప్పటి నుంచో అనుకున్నాను. కానీ ఇలా ఒక నటుడికి భార్య అవుతానని ఎప్పుడూ ఊహించలేదు. అదృష్టం నాకు ఇలా కలిసి వచ్చింది. నా కల నెరవేరింది.

కెరీర్ కూడా హ్యాపీగా..:

నా కెరీర్ కూడా బాగా హ్యాపీగా ముందుకు వెళ్తుంది. సాధారణంగా కమర్షియల్ బ్రాండ్లు గుర్తింపు ఉన్నవారి కోసమే చూస్తాయి. నా దగ్గరికి ఆ బ్రాండ్లను వెతుక్కుంటూ వచ్చాయి. అది ఇంకా హ్యాపీగా అనిపించింది. ప్రస్తుతం మా ఇద్దరి లైఫ్ చాలా హ్యాపీగా ముందుకు వెళ్తుంది. ఒక పక్క పర్సనల్ లైఫ్, మరొకపక్క ప్రొఫెషనల్ లైఫ్.. రెండింటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం” అంటూ చాలా ఆనందంగా తన వైవాహిక జీవితం గురించి చెప్పుకొచ్చారు ధూళిపాల. ఆమె మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.

 

View this post on Instagram

 

A post shared by VOGUE India (@vogueindia)

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you