Saturday, August 29, 2026
HomeLATESTNagarjuna:నాగార్జున 100వ మూవీ గ్లింప్స్ రిలీజ్..!

Nagarjuna:నాగార్జున 100వ మూవీ గ్లింప్స్ రిలీజ్..!

Nagarjuna: నాగార్జున పుట్టినరోజు సందర్భంగా ఆయన నటిస్తున్న కింగ్ 100 మూవీ నుండి టైటిల్ గ్లింప్స్ ను మేకర్స్ రిలీజ్ చేశారు.

on
- Advertisement -banner Ad

Nagarjuna:ఈరోజు టాలీవుడ్ సీనియర్ హీరో నాగార్జున పుట్టినరోజు ఈరోజు 68వ పుట్టినరోజు జరుపుకుంటున్న సందర్భంగా నాగార్జున అభిమానులు పలు రకాల సేవ కార్యక్రమాలు చేపట్టారు. నాగార్జున పుట్టినరోజు కావడం చేత సినిమాలకు సంబంధించి అప్డేట్ విషయం పైన అభిమానులు కూడా చాలా ఎక్సైటింగ్ గానే ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా నాగర్జున 100వ సినిమా పైన అభిమానులు భారీగానే అంచనాలు పెట్టుకున్నారు. అందుకు తగ్గట్టుగానే నాగార్జున 100 వ సినిమాకు సంబంధించి కింగ్ 100 అనే టైటిల్ ఫిక్స్ చేశారు.

ఆకట్టుకుంటున్న గ్లింప్స్..

డైరెక్టర్ రా కార్తిక్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందుకు సంబంధించి కింగ్ 100 వ చిత్ర గ్లింప్స్ విడుదల చేయగా అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. ముఖ్యంగా నాగార్జున వాయిస్ ఓవర్ తో గ్లింప్స్ మొదలవుతుంది.. మనుషుల్లో రెండు రకాలు.. ఒకరు డబ్బు ఉన్నోళ్లు.. మరొకరు లేని వాళ్ళు.. డబ్బు లేనప్పుడు నన్ను అందరూ లూసర్గా చూశారు. డబ్బు ఉన్నప్పుడు దే కాల్ మీ ది కింగ్ అంటూ పిలిచారు. ఈ ఐడెంటిటీ నిలబెట్టుకోవడం కోసం తాను పరిగెడుతూనే ఉన్నాను” అంటూ నాగార్జున చెప్పే డైలాగ్ హైలెట్ గా ఉంది.

- Advertisement -
Advertisement

also read:Bigg Boss10:సెప్టెంబర్ 6న బిగ్ బాస్ 10.. హౌస్‌లోకి వెళ్లే కంటెస్టెంట్లు వీళ్లేనా?

సినిమాపై హైప్ పెంచిన గ్లింప్స్..

గ్లింప్స్ లో చూపించిన విజువల్స్ ని బట్టి చూస్తే నాగార్జున(Nagarjuna) పాత్ర పేదరికం నుంచి సంపన్నుడిగా ఎలా ఎదిగారు అనే కథాంశంతో ఉన్నట్లుగా తెలుస్తోంది. డబ్బు లేని సమయంలో ఎదుర్కొన్న ఇబ్బందులు, అవమానాలు ఆ తర్వాత డబ్బు సంపాదన సమాజంలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకోవడం, ఆ గుర్తింపు కాపాడుకోవడానికి అతను చేసే పోరాటమే ఈ సినిమాలు కీలకమైన సన్నివేశాలు అన్నట్లుగా కనిపిస్తున్నాయి అయితే నాగార్జున పాత్ర ఏంటి? సంపాదించడానికి ఏం చేశారు ? అతని ప్రయాణంలో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి? అనే విషయాలు తెలియాలంటే సినిమా వచ్చేవరకు ఆగాల్సిందే.

- Advertisement -
Advertisement

also read:irumudi:రవితేజ ‘ఇరుముడి’ మూవీని మిస్ చేసుకున్న ముగ్గురు స్టార్ హీరోలు వీళ్లే..!

గెస్ట్ పాత్రలో ఆయనే?

ఇక నాగార్జున వందవ సినిమా కింగ్ గ్లింప్స్ లో చివరిలో ఒక చిన్నారిని ఎత్తుకొని కనిపించారు. అసలు ఆ పాప ఎవరు? నాగార్జునతో ఆ పాత్రకి ఉన్న సంబంధం ఏంటి ? అనే ప్రశ్న ఇప్పుడు అభిమానులలో మరింత ఆసక్తిని పెంచేలా చేస్తోంది. ఈ చిత్రంలో అఖిల్ లేదా నాగచైతన్య గెస్ట్ రోల్ లో కనిపించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనే విధంగా వినిపిస్తున్నాయి. మరి ఈ సినిమాకి సంబంధించి ఇంకా నటీనటుల వివరాలను కూడా చిత్ర బృందం అధికారికంగా ప్రకటించలేదు. నాగార్జున సినీ కెరియర్ లో ఎన్నో విభిన్నమైన కథ చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. మరి ఈసారి 100వ సినిమాతో ఎలాంటి విజయాన్ని అందుకుంటారో చూడాలి మరి. ఈ సినిమా డిసెంబర్ 24న విడుదల కాబోతోంది.

- Advertisement -
Advertisement

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you