ప్రగ్య జైస్వాల్.. కంచె సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు.
అందం , అభినయంతో ఆకట్టుకుంటూ ఊహించని పాపులారిటీ సొంతం చేసుకున్న ఈమె అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోల సినిమాలలో నటించే అవకాశం అందుకుంది.
బాలకృష్ణ హీరోగా నటించిన అఖండ సినిమాలో కలెక్టర్ పాత్ర పోషించి తన హుందాతనంతో అందరి దృష్టిని ఆకట్టుకుంది.
ఈ సినిమా విజయం అందించింది కానీ ఆ తర్వాత మళ్లీ బ్లాక్ బస్టర్ అవకాశాలైతే తలుపు తట్టలేదు.
సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉంటూ గ్లామర్ ఒలకబోస్తున్న ఈమె తాజాగా సెప్టెంబర్ నెల ప్రారంభం కావడంతో లైట్ లెమన్ కలర్ ఫ్రాక్ ధరించి అందాలతో ఆకట్టుకుంది.
కొత్త నెల కొత్త ఆరంభం అంటూ ఈ గ్లామర్ ఫోటోలు షేర్ చేయగా అవి సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఇక అమ్మడి అందానికి అభిమానులు ఫిదా అవుతున్నారు.