Wednesday, September 2, 2026
HomeLATESTAnand Deverakonda:పాన్ ఇండియా హీరో ఇంటికి కోడలు కాబోతున్న యంగ్ హీరోయిన్..?

Anand Deverakonda:పాన్ ఇండియా హీరో ఇంటికి కోడలు కాబోతున్న యంగ్ హీరోయిన్..?

Anand Deverakonda:టాలీవుడ్‌లో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జోడీపై మరోసారి ఆసక్తికరమైన చర్చ మొదలైంది.

on
- Advertisement -banner Ad

Anand Deverakonda:ఆనంద్ దేవరకొండ ఈ పేరుకు ప్రత్యేక పరిచయాలు చేయాల్సిన అవసరమే లేదు. టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ తమ్ముడిగా బాగానే గుర్తింపు సంపాదించుకున్నాడు. అడపాదడపా సినిమాల్లో నటిస్తూ తనకంటూ స్పెషల్ ఫ్యాన్ ఫాలోయింగ్ క్రియేట్ చేసుకున్నారు ఆనంద్ దేవరకొండ. ఆయన కెరీర్‌ను మలుపు తిప్పిన సినిమా ఏదైనా ఉంది అంటే మాత్రం అది కచ్చితంగా ‘బేబీ’ అని చెప్పాలి. బేబీ సినిమాలో ఆనంద్ దేవరకొండ, అదే విధంగా వైష్ణవి చైతన్య చాలా చక్కగా నటించి యువతను ఆకట్టుకున్నారు.

సెప్టెంబర్ 11న థియేటర్లలోకి సినిమా :

వీళ్ల కాంబోలో మళ్లీ వస్తున్న సినిమా “ఎపిక్” సెప్టెంబర్ 11న గ్రాండ్‌గా థియేటర్లలో రిలీజ్ కాబోతుంది. సెప్టెంబర్ 11న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ప్రమోషన్స్‌లో మూవీ టీమ్ చురుగ్గా పాల్గొంటోంది. రీసెంట్‌గా వైష్ణవి చైతన్య సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొని ఎలా సందడి చేసిందనేది సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతోంది. ప్రమోషన్స్‌లో భాగంగా వైష్ణవి చైతన్య ఇచ్చిన సరదా సమాధానాలు ఇప్పుడు యువతను బాగా ఆకట్టుకుంటున్నాయి. సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.

- Advertisement -
Advertisement

also read:Gautham:టాక్సిక్ సినిమాకి మహేష్ కుమారుడు రేటింగ్..!

సిద్దు, వీరాజ్, ఆనంద్‌లో ఎవరిని పెళ్లి చేసుకుంటారు?:

ఎపిక్ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా నిర్వహించిన రాపిడ్ ఫైర్‌లో వైష్ణవి చైతన్యను యాంకర్ అడిగిన ప్రశ్నలు ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్నాయి. సిద్దు జొన్నలగడ్డ, వీరాజ్ ఆనంద్ దేవరకొండ(Anand Deverakonda) ఈ ముగ్గురిలో ఎవరితో లవ్ చెప్తారు? ఎవరితో పెళ్లి చేసుకుంటారు? ఎవరికి బ్రేకప్ చెప్తారు? అని అడగ్గా.. వైష్ణవి చైతన్య ఇంట్రెస్టింగ్‌గా ఆన్సర్ ఇచ్చింది.

- Advertisement -
Advertisement

వీరాజ్‌కు బ్రేకప్ చెప్తానని, సిద్దు జొన్నలగడ్డతో లవ్ చేస్తానని, ఆనంద్ దేవరకొండను మాత్రం పెళ్లి చేసుకుంటానని చెప్పుకొచ్చింది. దీంతో ఈ సమాధానం సోషల్ మీడియాలో బాగా వైరల్‌గా మారింది.

అసలే వీళ్లిద్దరి కెమిస్ట్రీ చూసి వీళ్ల మధ్య ఏదో ఉంది అనుకుంటున్నారు జనాలు. దానికి తగ్గట్టే వైష్ణవి చైతన్య ఆనంద్ దేవరకొండను పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో జనాల డౌట్లు మొత్తం క్లారిటీ వచ్చేశాయి. వీళ్లు నిజంగానే లవ్‌లో ఉన్నారని, పెళ్లి చేసుకుంటారేమోనని ఈ విధంగా హింట్ ఇస్తున్నారని బోల్డ్‌గా మాట్లాడుకుంటున్నారు.

- Advertisement -
Advertisement

also read:TV:బుధవారం బుల్లితెరపై సినిమాల జాతర.. ఏ సినిమా ఎప్పుడంటే?

బేబీ, అర్జున్ రెడ్డిలో ఏ సినిమా ఇష్టం?:

ఇదే సెషన్‌లో యాంకర్ అడిగిన మరికొన్ని పర్సనల్ విషయాలకు కూడా చాలా ఫన్నీగా ఆన్సర్ ఇచ్చింది వైష్ణవి చైతన్య. బేబీ లేదా అర్జున్ రెడ్డి.. ఈ రెండింట్లో ఏ సినిమా ఇష్టమని అడగ్గా.. తన కెరీర్‌ను మలుపు తిప్పిన ‘బేబీ’ మూవీ అంటూ ఆన్సర్ ఇచ్చింది. అంతేకాదు.. బెడ్‌రూమ్ లేదా బాల్కనీ అన్న ప్రశ్నకు బాల్కనీ అంటేనే ఇష్టం అంటూ నవ్వుతూ ఆన్సర్ ఇచ్చింది. వైష్ణవి చైతన్య చెప్పిన సమాధానాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి మధ్య కెమిస్ట్రీ చూసి వీళ్లు త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you